‘గౌత‌మ్ నంద’ దెబ్బ అలా.. ఇలా లేదు!

గౌత‌మ్ నంద సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు గోపీచంద్‌. ఆక్సిజ‌న్‌, ఆర‌గ‌డుగుల బుల్లెట్‌, గౌత‌మ్ నంద – ఈ మూడు సినిమాల్లోనూ త‌న అంచ‌నాలన్నీ ఈసినిమాపైనే ఉండేవి. ఆడియో ఫంక్ష‌న్‌లో ”ఇదిగో ఈసారి సూప‌ర్ హిట్ కొట్టేస్తున్నాం కాచుకోండి” అన్న‌ట్టుగానే మాట్లాడాడు. ఇంట‌ర్వ్యూల‌లోనే ఓవ‌ర్ కాన్షిడెన్స్ ప్ర‌ద‌ర్శించాడు. సాధార‌ణంగా కూల్ గా కామ్ గా ఉండే గోపీచంద్ – ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే క‌చ్చితంగా సినిమాలో విష‌యం ఉండే ఉంటుంద‌నుకొన్నారంతా. తీరా చూస్తే… సినిమా ఫ‌ట్ మంది. దాంతో.. గోపీచంద్ క‌ల‌ల మేడ‌లు కూలిపోయాయి. ఈ సినిమాపై రిజ‌ల్ట్ కోసం ఆర‌గ‌డుగుల బుల్లెట్‌, ఆక్సిజ‌న్ కాచుకొని కూర్చున్నాయి.

గౌత‌మ్ నంద పాజిటీవ్ గా ఉంటే.. ఈ నెల‌లోనే మ‌రో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిపోదును. ఆక్సిజ‌న్ మాటేమో గానీ, ఆర‌గుడుల బుల్లెట్ మాత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేద్దును. కానీ.. సీన్ రివ‌ర్స్ అయ్యింది. తొలి రోజు మిన‌హాయిస్తే.. వ‌సూళ్లు ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. రూ.25 కోట్ల‌తో తీసిన సినిమా ఇది. ప‌ట్టుమ‌ని ప‌ది కోట్లు కూడా వ‌చ్చేట్టు క‌నిపించ‌డం లేదు. దాంతో… ఆర‌గుడుల బుల్లెట్ విడుద‌ల మ‌రీ క్లిష్ట‌మైపోయింది. అద‌నే కాదు.. ఆక్సిజ‌న్ కూడా ఇప్ప‌ట్లో ధైర్యం చేయ‌కపోవొచ్చు. ఓ ఫ్లాప్‌… రెండు సినిమాల‌పై ప్ర‌భావం చూపించేసింది. గోపీచంద్ సినిమా థియేట‌ర్లో చూడాలంటే ఇంకొంత‌కాలం ఆగ‌క త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close