జ‌న్మ‌భూమి క‌మిటీలతో టీడీపీకి కొత్త త‌ల‌నొప్పి!

జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి అప్ప‌ట్లో టీడీపీ నియ‌మించింది. అయితే, ఇప్పుడు క‌మిటీల ప‌నితీరు ప్ర‌భుత్వం ప‌రువును బ‌జారుకు ఈడ్చేలా చేస్తోంద‌ని అధికార పార్టీ ఒప్పుకున్న‌ట్ట‌యింది! క‌మిటీల పనితీరుపై ఈ మ‌ధ్యా వ‌రుస‌గా ఫిర్యాదులు అందుతున్నాయ‌ట‌. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల కేటాయింపుల్లో స్వార్థ‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, అస్మ‌దీయుల‌కే ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌మిటీలపై ప్ర‌త్యేక దృష్టి సారించి, స‌మ‌గ్ర స‌ర్వే చేయించిన‌ట్టు చెబుతున్నారు. ప్ర‌భుత్వం ప‌రువు తీసే స్థాయిలో క‌మిటీల ప‌నితీరు ఉంటోంద‌ని స‌ద‌రు స‌ర్వేలో తేలిన‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడున్న జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఒక్క క‌లం పోటుతో సీఎం ర‌ద్దు చేశారు. వీటి స్థానంలో కొత్త క‌మిటీలు వేస్తార‌ని చెబుతున్నారు. సీఎం నిర్ణ‌యంతో 12 వేల క‌మిటీల‌ను ఒకేసారి ర‌ద్దు చేసిన‌ట్ట‌యింది.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి టీడీపీ ఎంతో శ్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా పార్టీ కోసం పాటుప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులు క‌ల్పించాల‌న్న సంక‌ల్పంతో పెద్ద ఎత్తున జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను సీఎం ఏర్పాటు చేశారు. వీటిని వేసి మూడేళ్లు దాటుతున్నా ప‌నితీరు ఏమాత్రం సంతృప్తిక‌రంగా లేద‌ట‌! ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌య‌త్నించినా… క‌మిటీల ప‌నితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. అంతేకాదు, చాలా క‌మిటీల్లో స‌భ్యులు అతిగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టార‌నే ఫిర్యాదులు పెరిగాయి. పెన్ష‌న్లు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌జ‌లంద‌రి కోసం అమ‌లు చేస్తుంటే… అవ‌న్నీ ముందుగా త‌మ‌వారికే ద‌క్కాల‌న్న ఉద్దేశంతో క‌మిటీల సిఫార్సులు ఎక్కువైపోయాయ‌ట‌. దీంతో చాలామంది అన‌ర్హుల‌కు పింఛెన్లు లాంటివి ద‌క్క‌డంతోపాటు, అర్హులైన సామాన్య ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌నే విమ‌ర్శ‌లు పెరిగాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా క‌మిటీ స‌భ్యుల‌ను ఏమీ అన‌లేని ప‌రిస్థితి. దీంతో, ఇంకా ఉపేక్షిస్తూపోతే అధికార పార్టీ ప‌రువు పోయేట్టుగా ఉంద‌నే ఉద్దేశంతో ఒకేసారి అన్నింటినీ ముఖ్య‌మంత్రి ర‌ద్దు చేశారు.

అయితే, ఒకేసారి 12 వేల క‌మిటీల‌ను ర‌ద్దు చేయ‌డం ద్వారా కార్య‌క‌ర్త‌ల్లో కొంత అసంతృప్తి వ్య‌క్త‌మయ్యే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. స‌రిగ్గా ప‌నిచేయ‌నివారిని గుర్తించి, వారి వ‌ర‌కే చ‌ర్య‌లు ప‌రిమితం అయితే మిగ‌తావారికి గుణపాఠంగా ఉండేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే అంటున్నాయి. కొత్త క‌మిటీలు అయినా స‌రిగా ప‌నిచేస్తాయా లేదా అనేది వేచి చూడాలంటూ కొంత‌మంది టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి, జన్మ‌భూమి క‌మిటీలు టీడీపీ స‌ర్కారుకి బాగానే త‌ల‌నొప్పులు తెచ్చాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close