బిగ్ బాస్‌కి క‌మ‌ల్ హాస‌న్ వార్నింగ్

తెలుగు బిగ్ బాస్ షోలో పెద్ద సంచ‌ల‌నాలేం లేవు గానీ – త‌మిళ వెర్ష‌న్ మాత్రం హాట్ హాట్ గా సాగుతోంది. క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ముందు నుంచీ వివాదాస్ప‌ద‌మే. ఈ షోపై లెక్క‌లేన‌న్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దానికి తోడు ఈ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింద‌న్న వార్త త‌మిళ నాట క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఈ షోలో ఇస్తున్న టాస్క్‌ల‌ను పూర్తి చేయ‌డంలో విఫ‌ల‌మైన వాళ్లంతా మాన‌సికంగా కృంగిపోతున్నార‌ని, అది వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌పై ప్ర‌భావం చూపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. టీవీ చూస్తున్న వాళ్లు కూడా మాన‌సికంగా ప్ర‌భావితం అవుతున్నార‌ని, వాళ్ల‌పైనా ప‌రోక్షంగా బిగ్ బాస్‌షోలు చెడు ప్ర‌భావం చూపిస్తున్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. ఇటీవ‌ల త‌మిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు మాన‌సిక విక‌లాంగులుగా న‌టించాల్స‌వ‌చ్చింది. దీనిపైనా పెద్ద దుమారం రేగుతోంది. విక‌లాంగుల్ని ఇది అవ‌మాన ప‌ర‌చ‌డ‌మే అంటూ సోష‌ల్ మీడియాలో ఈ షోని ఏకి ప‌రేస్తున్నారు.

క‌మ‌ల్‌హాస‌న్ కూడా దీనిపై స్పందించాడు. ఇలాంటి టాస్క్‌లు ఇవ్వ‌డం ఏమిట‌ని మండిప‌డ్డాడు. ఇక మీద‌ట ఎవ‌రినైనా కించ‌ప‌రిచేలా టాస్క్‌లు ఇస్తే.. ఈ షో నుంచి త‌ప్పుకొంటాన‌ని హెచ్చ‌రించాడు క‌మ‌ల్‌. విక‌లాంగుల ప‌ట్ల త‌న‌కు చాలా గౌర‌వం ఉంద‌ని, వాళ్ల‌ని ఎప్పుడూ కించ‌ప‌ర‌చ‌లేద‌ని, ఒక‌వేళ తన సినిమాలో విక‌లాంగుల్ని చూపించినా, వాళ్ల‌ని హీరో స్థాయి పాత్ర‌లోనే చూపించాన‌ని చెబుతున్నాడు. మొత్త‌మ్మీద ఈ కాంట్ర‌వ‌ర్సీల పుణ్య‌మా అని బిగ్ బాస్‌కి ఊపొచ్చింది. టీవీ రేటింగులూ అమాంతం పెరుగుతున్నాయి. బిగ్ బాస్ ల‌క్ష్యం ఇదే క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close