పోస్ట‌ర్ల సంగ‌తి స‌రే.. వేడి ముద్దుల మాటేంటి?

ఏదేమైనా.. ‘అర్జున్‌రెడ్డి’కి కావ‌ల్సినంత ప్ర‌చారం ల‌భించేస్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ కాస్త కామ్‌గా, స్థ‌బ్దుగా సాగిన అర్జున్ రెడ్డి ప్ర‌చార ప‌ర్వం.. వీహెచ్ రాక‌తో జోరందుకొంది. అస‌భ్యంగా క‌నిపిస్తున్నాయ‌ని చెప్తూ… ఆర్టీసీ బ‌స్సుల‌పై ఉన్న అర్జున్ రెడ్డి పోస్ట‌ర్ల‌ని వీహెచ్ పీకేయ‌డంతో కాస్త క‌ల‌ల‌కం రేపింది. దానికి తోడు మ‌హిళా సంఘాలు కూడా ఈ పోస్ట‌ర్లేంటి అంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. సెన్సార్ వాళ్లు ఎల‌గూ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబ‌ట్టి – ఈ ప్ర‌చారానికి ఇంకాస్త మ‌షాలా అంటింది. ఇప్పుడు చిత్ర‌బృందం తాయితీగా మేల్కొంది. లిప్ లాక్ పోజుతో ఉన్న పోస్ట‌ర్ల‌ని ఎక్క‌డున్నా స‌రే.. తీసేస్తాం అంటూ తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో.. మ‌హిళా సంఘాల వారినీ, వీహెచ్ లాంటి రాజ‌కీయ నాయ‌కుల్నీ కాస్త శాంతింప జేయొచ్చు. అది స‌రే గానీ.. వెండి తెర‌పై క‌నిపించ‌బోతున్న ఘాటు ముద్దుల మాటేంటి?

– అదొక్క‌టీ అడ‌గొద్దు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టికెట్టు తెగ‌డానికి, థియేట‌ర్ల‌లోకి అడుగుపెట్ట‌డానికీ ఆక‌ర్షించే అతి ప్ర‌ధాన అంశాల్లో అదొక‌టి. ముద్దు సీన్లు య‌ధావిధిగా ఉండ‌బోతున్నాయి. పోస్ట‌ర్లు మాత్రం క‌నిపించ‌వు. తెర‌పై ఆ లిప్ లాక్కుల్నీ తీసేస్తే… ఇప్ప‌టి వ‌ర‌కూ చేసుకొచ్చిన ప్ర‌చారం ఏమైపోతుంది?? ఈ సినిమాలో ఘాటు ముద్దులున్నాయి అన్న సంగ‌తి ఎలాగో ప్ర‌చారం ద్వారా తెలిసిపోయింది కాబ‌ట్టి.. పోస్ట‌ర్లు పీకేస్తారంతే. థియేట‌ర్ల‌లో మాత్రం ఆ మ‌సాలా.. కంటిన్యూ అవ్వ‌బోతోంది. అదీ.. మేట‌రు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close