‘సైరా..’ ఈ పేరే ఎందుకు పెట్టారంటే..?

‘ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి’ టైటిల్ కాస్త ‘సైరా – న‌ర‌సింహారెడ్డి’గా మారిపోయింది. మొద‌ట్లో సై రా అంటే ఏమిటో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ‘సై..’ ‘రా’ అంటూ ప్ర‌త్య‌ర్థిని క‌వ్వించే గుణం ఉన్న వీరుడు కాబ‌ట్టి.. ఈ పేరు సెట్ చేశారా? లేదంటే మాస్‌కి చేరువ అవ్వ‌డానికి క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచించారా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అయితే రాయ‌ల‌సీమ‌లో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిపై జ‌న‌ప‌దులు ఓ గీతాన్ని పాడుకొంటారు. ఆ పాట ‘సైరా’ అనే ప‌దంతో ప్రారంభం అవుతుంది. రాయ‌ల‌సీమ‌లో ఈ పాట చాలా పాపుల‌ర్‌. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప‌ద‌నం కీర్తిస్తూ పాడే ఈ పాట‌లోని తొలి ప‌దాన్నే.. టైటిల్‌గా పెట్ట‌డంతో రాయ‌ల‌సీమ వాసుల మ‌న‌సుల్ని గెలుచుకొనే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం. అయితే.. అన్ని భాష‌ల్లోనూ ఇదే టైటిల్‌తో విడుద‌ల చేస్తారా? త‌మిళ, హిందీ కోసం టైటిల్ మారుస్తారా?? అనేది తెలియాలంటే ఇంకొంత‌కాలం వేచి చూడాలి.

అన్న‌ట్టు ఉయ్యాల వాడ న‌రసింహారెడ్డి పై రాయ‌ల‌సీమ వాసులు పాడుకొనే పాట ఇదిగో… ఇదే..

”సైరా నరసింహారెడ్డి
నీ పేరే బంగార్పూకడ్డీ
రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి
రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి
ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు
రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)
మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా
దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా
కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై
సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)”

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close