ఎన్టీఆర్ బ‌యోపిక్ : వ‌ర్మ‌కి ఇంకా ఛాన్స్ ఉంది

నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని సినిమాగా తీయాల‌నుకోవ‌డం బాక్సాఫీసు ద‌గ్గ‌ర షేక్ చేసే ఆలోచ‌నే. కాసుల వ‌ర్షం కురిపించ‌గ‌ల స‌త్తా ఉన్న బ‌యోపిక్‌లలో ఎన్టీఆర్‌దీ త‌ప్ప‌కుండా ఉంటుంది. అయితే ఆ సినిమాకి బ‌హుశా రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు కావొచ్చ‌న్న విష‌య‌మే నంద‌మూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. వ‌ర్మ ట్రాక్ గురించి తెలియంది కాదు. ఇప్పుడాయ‌న రూపాయి, పావ‌లా సినిమాలు కూడా తీసేస్తున్నాడు. వ‌ర్మ‌కీ – బాల‌య్య‌కు ఎలా సెట్ అవుతుందా? అని లాజిక్కులు తీస్తే.. అస‌లు ఈ ప్రాజెక్టుపై న‌మ్మ‌కాలే పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అయితే బాల‌య్య నుంచి కానీ, ఆయ‌న కాంపౌండ్ నుంచి గానీ ‘ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి వ‌ర్మ‌నే ద‌ర్శ‌కుడు` అని చెప్పింది లేదు. కాక‌పోతే… వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు కొట్టిప‌డేయ‌లేం.

ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లకు నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్యేక ఇంటర్వ్యూలే ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన ప్ర‌శ్న‌లొచ్చాయి. ద‌ర్శ‌కుడు ఎవ‌రు? రాంగోపాల్ వ‌ర్మ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? అని అడిగితే ”ఇంకా అనుకోలేదు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడ్ని ప్ర‌క‌టిస్తామ‌”న్నారు బాల‌య్య‌. సో.. అప్ప‌టి వ‌ర‌కూ వ‌ర్మ ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగొచ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close