5 దాటాకే షో… బాల‌య్య ముహూర్తం

బాల‌య్య‌కు ముహూర్తాల ప‌ట్టింపులు ఎక్కువ‌. ఇంట్లోంచి బ‌య‌ట‌కురావాల‌న్నా శుభ ఘ‌డియ‌లు చూడాల్సిందే. అలాంటిది సినిమా విడుద‌ల విష‌యంలో ఇంకెంత నిక్కచ్చిగా ఉంటారో వేరే చెప్పాలా?? మరి కొద్ది గంట‌ల్లోనే `పైసా వ‌సూల్ ` విడుద‌ల కాబోతోంది. విడుద‌ల‌కు ముందు రోజు ఫ్యాన్స్ షోల పేరుతో హ‌డావుడి చేయ‌డం మామూలే. కానీ.. `పైసా వ‌సూల్‌`కి స్పెష‌ల్ షోలేం లేవు. శ‌క్ర‌వారం ఉద‌యం ఆట‌ల‌తోనే పైసా వ‌సూల్ సంద‌డి మొద‌ల‌వుతుంది. ఫ్యాన్స్ అర్థ‌రాత్రి షోలు వేసుకొంటామ‌ని ముందుకొచ్చినా… పోలీసు శాఖ అందుకు అనుమతి ఇవ్వ‌లేదు. కావాలంటే గురువారం 9 గంట‌ల షో వేసుకోండి.. లేదంటే.. శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు షో వేసుకోండి అన్నార్ట‌. అయితే ఈలోగా బాల‌య్య ఈ సినిమాకి ముహూర్తం నిర్ణయించేశారు. శుక్ర‌వారం ఉద‌యం 5 గంట‌లు దాటిన త‌ర‌వాతే షో ప‌డాల‌ని ఆర్డరేశారు. ఆయ‌న్ని కాద‌ని చేసేదేముంది? అందుకే గురువారం రాత్రి పైసా వ‌సూల్ ప్ర‌ద‌ర్శించే ధైర్యం చేయ‌లేక‌పోయింది చిత్ర‌బృందం. డైరెక్ట‌ర్స్ డిపార్ట్‌మెంట్‌కి ఓ షో వేద్దామ‌ని పూరి అడిగినా.. బాల‌య్య కాద‌న్నాడ‌ట‌. ఉద‌యం 6 గంట‌ల షో కూడా దాదాపు గా లేక‌పోవొచ్చు. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 8.45 కి ఆట మొద‌ల‌వుతుంది. పైసా వ‌సూల్ తొలి షో ప‌డేది కూడా అప్పుడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close