అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడి ‘షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ’

అర్జున్ రెడ్డి తీసిన సందీప్ రెడ్డి వెనుక ఇప్పుడంటే నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నారు గానీ, ఒక‌ప్పుడు ఆయ‌న క‌థ‌లు ప‌ట్టుకొని నిర్మాత‌ల వెంట తిరిగిన‌వాడే. అర్జున్ రెడ్డి క‌థ‌ని చాలామందికి చెప్పి ‘నో’ అనిపించుకొన్నాడు. నిర్మాత‌లెవ‌రూ ఈ క‌థ‌ని న‌మ్మ‌క‌పోవ‌డం వ‌ల్ల తానే నిర్మాత‌గా మారాల్సివ‌చ్చింది. అయితే అర్జున్ రెడ్డి క‌థ కంటే ముందే.. ‘షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ’ అనే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ ని త‌యారు చేసుకొన్నాడ‌ట సందీప్ రెడ్డి. ఆ క‌థ ప‌ట్టుకొని దాదాపు యేడాది తిరిగాడ‌ట‌. కానీ.. ఒక్క నిర్మాతా ధైర్యం చేయ‌లేదు. ‘నీ ఇంటిలిజెన్సీ మ‌రీ ఎక్కువైపోయింది.. అది త‌గ్గించుకో. అంద‌రికీ అర్థ‌మ‌య్యే క‌థ ఎంచుకో’ అని స‌ల‌హా ఇచ్చార‌ట‌. క్రైమ్ స్టోరీల కంటే ల‌వ్ స్టోరీనే బెట‌ర్ అనుకొని, ఆ క‌థ ప‌క్క‌న పెట్టేసి అప్పుడు అర్జున్ రెడ్డి స్క్రిప్టు త‌యారు చేసుకొన్నాడు. దాన్నిఏ నిర్మాతా న‌మ్మ‌లేద‌నుకోండి… అది వేరే విష‌యం. కాక‌పోతే.. ఇప్పుడు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ తీయ‌డానికి నిర్మాత‌లు పోటీ ప‌డి మ‌రీ ముందుకొస్తారు. స‌క్సెస్ ఉన్న‌వాడికే విలువ ఎక్కువ కదా? కాక‌పోతే.. షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ అనే సినిమాని ఎప్ప‌టికైనా తానే నిర్మిస్తాన‌ని, అది త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన స‌బ్జెక్ట్ అని చెబుతున్నాడు సందీప్ రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close