కెటిఆర్‌ కోపం- కలెక్టర్లకు ఇరకాటం

వరంగల్‌ జిల్లా పర్యటనలో కలెక్టర్‌ ఆమ్రపాలిపై మంత్రి కెటిఆర్‌ తీవ్ర ఆగ్రహం బాగా ప్రచారమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ వాగ్దానం చేసిన వాటితో సహా అనేక పథకాలు ఆలస్యం అవుతున్నాయన్నది ఆయన ఆగ్రహానికి కారణమట. అధికారులపై అమాత్యుల ఆగ్రహం కొత్త కాదు గాని ఇప్పుడు తెలంగాణలో వున్న పరిస్థితులలో కెటిఆర్‌ మందలింపులకు మరింత ప్రాదాన్యత ఏర్పడుతున్నది. ఇప్పటికే దాదాపు 14 జిల్లాల్లో కలెక్టర్లకూ జిల్లాలోని పాలక పక్ష ప్రజా ప్రతినిధులకూ మధ్యన ఘర్షణలూ ఉద్రిక్తతలూ కొనసాగుతున్నాయి. వారంతా అధికారులపై కారాలు మిరియాలు నూరుతున్నారు కూడా. కలెక్టర్లు నిజాయితీగా వున్న చోట ఈ ఘర్షణలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ మాట వినితీరాలని ఎంఎల్‌ఎలు పట్టుపట్టడం వారు తిరస్కరించడంతో సమస్య మొదలవుతున్నది. అలా చికాకులకు గురైన వారిలో అమ్రపాలి కూడా ఒకరు. ఇటీవల తన మీడియా గోష్టిలో కెసిఆర్‌ ఇదేమంత సమ్ణస్య కాదన్నట్టు తీసిపారేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అయితే అధికారులు తమ పరిధిలో తాముండాలని హెచ్చరిక వంటిది చేశారు. ఇక ఇప్పుడు షెహన్‌షా కెటిఆర్‌ కూడా ఆమ్రపాలిని నేరుగా మందలించడం అధికారుల పక్షానికి అశనిపాతమే. టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రతి చోటా నాయకుడికి తాము భయపడవలసి వస్తున్నదని వారంటున్నారు. ఈ నేపథ్యం గమనంలో వుండి వుంటే కెటిఆర్‌ అంతగా ఆగ్రహించేవారు కాదేమో.. లేక కావాలనే దాచుకోకుండా వచ్చిన కోపాన్ని ప్రకటించారేమో.. ఏమైనా తండ్రీ కొడుకులిద్దరూ అధికారులఫిర్యాదులకు పెద్ద విలువ ఇవ్వకపోవడం, కెటిఆర్‌ మరింత తీవ్రంగా మండిపడటం చూస్తుంటే రాజకీయంగా ప్రభుత్వ వైఖరి అదేనని అర్థమవుతుంది. ఒక వేళ కలెక్టర్‌ ఆమ్రపాళి చాలా పనులు చేయడంలో వెనకబడ్డారని అనుకున్నా వాటిని చక్కదిద్దడానికి మార్గం బహిరంగంగా ఆగ్రహం కురిపించడం కాదు కదా! జిల్లాల సంఖ్య మూడు రెట్లు పెంచితే వికేంద్రీకరణతో పనులు వేగంగా జరిగిపోతాయని చెప్పిన మాట కూడా నిజం కాదని ఈ పరస్పర ఆగ్రహాలు ఆవేదనలను బట్టి అర్థమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close