వాళ్లిద్దరి పెళ్లికి మీడియా పెట్టిన ముహూర్తం ఒట్టిదే…

అదిగో పెళ్లి… ఇదిగో పిల్లలు అంటూ సెలబ్రిటీ లవర్స్‌కు ఇష్టమొచ్చినట్టు ముడివేసేసే మీడియా… క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకి, ఆయన ప్రేయసి అనుష్క శర్మ పెళ్లికీ కూడా తాజాగా ఓ ముహూర్తం పెట్టేసింది. అయితే అది పుకారేనని ఇప్పుడు తేలింది.

గత రెండు రోజులుగా మీడియాలో వీరిద్దరి పెళ్లి గురించి పెద్ద యెత్తున రూమర్లు చెలరేగాయి. నాలుగేళ్లుగా వార్తల్లో నానుతున్న ఈ ప్రేమికులు డిసెంబరు నెలలో పెళ్లి చేసుకుని, ఒక్కటి కానున్నారంటూ తేల్చేశాయి. ఈ విషయంలో బ్రేకింగ్‌ల మీద బ్రేకింగ్‌లు ఇవ్వడంలో భాషలకు అతీతంగా చానెళ్లు పోటీపడ్డాయి. అంతేకాదు తాజాగా ఒక వెడ్డింగ్‌ థీమ్‌తో రూపొందిన యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించడం, ఆ యాడ్‌ హల్‌చల్‌ చేస్తుండగానే వీరిద్దరి పెళ్లి ఖరారవడం అంతా కో ఇన్సిడెన్స్‌ అంటూ ఏదేదో కధనాలను వండి వార్చాయి.

అయితే తమ పెళ్లి ముచ్చట . తమ పెళ్లికి మీడియా పెట్టిన ముహూర్తం ఒట్టి అబద్ధం తోసిపుచ్చారీ సెలబ్రిటీ ప్రతినిధులు. అనుష్క వ్యవహారాలు చూసే టాలెంట్‌ ఏజెన్సీ ఇవన్నీ రూమర్లంటూ నిర్ద్వందంగా ఖండిచింది. మరి ఇంతకీ ఈ నిప్పు లేని పొగ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మ్యాచ్‌ మ్యాచ్‌కూ పరుగుల వరద పారిస్తూ, విపరీతమైన, నిర్విరామ క్రికెట్‌ షెడ్యూల్‌తో అలసిపోయిన విరాట్‌ సెలవు కోరడమే ఈ పుకార్లనే పొగను రాజేసిన నిప్పు. గత కొంతకాలంగా భారతీయ క్రికెట్‌కు ఊపిరిసలపని షెడ్యూల్‌ ఉంది. ఈ నేపధ్యంలో వ్యక్తిగత కారణాలతో డిసెంబరులో తనకు సెలవు కావాలని కొహ్లీ బిసిసిఐని అభ్యర్ధించాడు. ఈ అభ్యర్ధన బయటకు రావడంతో ఇలాంటి వార్తల కోసమే కాచుక్కూచునే మీడియా దీన్ని చిలవలు పలువలు చేసి… పెళ్లి కూడా చేసేద్దామని సరదా పడిపోయింది. అదండీ సంగతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close