నానితో కిషోర్ తిరుమ‌ల‌

నేను శైల‌జ‌తో ఆక‌ట్టుకొన్నాడు కిషోర్ తిరుమ‌ల‌. ఇప్పుడు ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ సినిమాతో మ‌రోసారి త‌న ప్రతిభ చాటుకోవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే పాట‌లు, ప్ర‌చార చిత్రాలూ ఆక‌ట్టుకొంటున్నాయి. దాంతో యువ క‌థానాయ‌కులంతా కిషోర్‌కి క‌ర్చీఫ్‌లు వేసే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి నానితో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్ ఈచిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. నాని ప్ర‌స్తుతం ఎంసీఏతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత కృష్ణార్జున యుద్ధం సినిమా పూర్తి చేయాల్సివుంటుంది. ఈ రెండు చిత్రాలూ పూర్త‌య్యాకే కిషోర్ తిరుమ‌ల‌తో సినిమా ప‌ట్టాలెక్కిస్తాడు. నానికి ఇటీవ‌లే ఓ క‌థ వినిపించాడు కిషోర్‌. దాన్ని పూర్తి స్థాయిలో సిద్దం చేయ‌డానికి స‌మ‌యం అడిగాడ‌ట‌. నాని కూడా ఓకే అన‌డంతో ఈ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిపోయింది. వెంక‌టేష్ కోసం `ఆడాళ్లూ మీకు జోహార్లు` అనే క‌థ‌నీ రాసుకొన్నాడు కిషోర్‌. రామ్ చ‌ర‌ణ్ కూడా కిషోర్‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నానితో సినిమా తీసి హిట్ కొడితే… అప్పుడు చ‌ర‌ణ్ లాంటి వాళ్లతో సినిమాలు చేయ‌డానికి రెడ్ కార్పెట్ సిద్ద‌మైపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close