రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం ఇదే..!

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వ‌చ్చేశారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న అధికారికంగా పార్టీలో చేరిపోవ‌డం, ఆయ‌న‌తోపాటు కొంత‌మంది టీడీపీ నేత‌లు కూడా పార్టీ కండువాలు క‌ప్పుకోవ‌డం.. అన్నీ జ‌రిగిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కుడిగా రేవంత్ రెడ్డి కిం క‌ర్త‌వ్యం ఏంటి..? తెరాస‌పై మాట‌లు యుద్ధం పెంచినంత మాత్రాన కాంగ్రెస్ లో ప్ర‌త్యేక స్థానం ల‌భించేసిన‌ట్టు అవుతుందా..? ఈ త‌రుణంలో ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉంటున్న సీనియ‌ర్ నేత‌లు త‌న‌ని సొంతం చేసుకోవాలంటే రేవంత్ ఏం చేయాలి..? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు రేవంత్ చుట్టూ ఉన్నాయి. ఇల్లు అలికినంత మాత్రాన పండుగ అయిపోదు! అస‌లే కాంగ్రెస్ పార్టీ. పైపైకి ఐక‌మ‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య కావాల్సినంత అసంతృప్తి. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి నెగ్గుకుని రావాలంటే అంద‌రూ ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం క‌లుపుకుంటూ పోవాలి. ప్ర‌స్తుతం రేవంత్ అదే ప‌ని సైలెంట్ గా చేసుకుంటూ వ‌స్తున్నార‌ని చెప్పాలి.

మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై చాలాసేపు ఆమెతో చ‌ర్చించారు. తాను పార్టీ మారాల్సి వ‌చ్చిన ప‌రిస్థితుల‌ను ఒక్కోటిగా ఆమెకి వివ‌రించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై ఇరువురు నేత‌లూ చ‌ర్చించుకున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌ల స‌మ‌క్షంలో కొంత‌మంది తెరాస నేత‌లు కాంగ్రెస్ లో చేరారు. 1969తో తెలంగాణ తొలిద‌శ ఉద్య‌మ జ‌రిగింద‌నీ, 2009లో మ‌లిద‌శ ఉద్య‌మం జ‌రిగి, ఎంతోమంది ఆత్మ‌ బ‌లిదానాల‌కు ఫ‌లితంగా తెలంగాణ సిద్ధించింద‌నీ, కానీ వారి త్యాగాల‌కు అనుగుణంగా స‌ర్కారు ప‌నిచేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. 2019లో తుది ద‌శ ఉద్య‌మం న‌డిపించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు. స‌రే.. ఆయ‌న మాట‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడితే, కొద్ది రోజుల కింద డీకే అరుణతో కూడా ఇలానే వ్య‌క్తిగ‌తంగా రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా అరుణ ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంట‌ల సేపు రేవంత్ మాట్లాడారు. త‌మ గౌర‌వానికీ, పెద్ద‌రికానికీ ఎక్క‌డా ఎలాంటి లోటు రాకుండా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని ఆమెతో రేవంత్ చెప్పిన‌ట్టు స‌మాచారం. మొద‌ట్నుంచీ రాజ‌కీయ వైరం ఉంటూ వ‌చ్చిన డీకే అరుణ‌ను ఆ విధంగా ప్ర‌స‌న్నం చేసుకున్నారు.

త‌న రాకపై అసంతృప్తిగా ఉన్న‌ సీనియ‌ర్ల‌ను ఒక్కొక్క‌రిగా రేవంత్ క‌లుసుకుంటూ వ‌స్తున్నారు. నిజానికి, రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించొద్దంటూ కొంత‌మంది పెద్ద‌లు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కు ఆ మ‌ధ్య లేఖ రాశారు క‌దా. వారి అభిప్రాయాల‌ను కాద‌ని మ‌రీ పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా రేవంత్ ను చేర్చుకున్నారు. ఫిర్యాదు చేసిన స‌ర‌దు పెద్ద‌లకి హైక‌మాండ్ క్లాస్ తీసుకుంటే స‌రిపోతుంది! కానీ, క్షేత్ర‌స్థాయిలో రేవంత్ పై వారిలో అసంతృప్తి అలానే ఉండిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే, తానే స్వ‌యంగా సీనియ‌ర్ల‌ను క‌లుసుకుంటూ.. మీ అంద‌రి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోనే ప‌నిచేస్తాను అనే భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న చేరిక‌తో అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్లంద‌రినీ ఇలానే రేవంత్ క‌లుసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close