‘శివ‌గామి’ బ‌డ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వెబ్ సిరీస్‌ల జ‌మానా మొద‌లైంది. ఇదో గొప్ప ఆదాయ సూత్ర‌మ‌ని చిత్ర‌సీమ గ‌ట్టిగా న‌మ్ముతోందిప్పుడు. సినిమాల్లో కంటే, డిజిట‌ల్ మీడియాలోనే లాభాలున్నాయ‌న్న సంగ‌తి మెల్ల మెల్ల‌గా రూఢీ అవుతుండ‌డంతో వీటివైపు దృష్టి నిలుపుతున్నారు. బాహుబ‌లిలోని మేటి పాత్ర ‘శివ‌గామి’.. ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో రాబోతోంది. శివ‌గామిగా ఎవ‌రు క‌నిపిస్తార‌న్న విష‌యం ఇంకా తెలియ‌క‌పోయినా – ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వెబ్ సిరీస్ బ‌డ్జెట్ దాదాపుగా రూ.7.5 కోట్ల‌ని తెలిసింది. ఈ స్థాయిలో ఓ వెబ్ సిరీస్‌కి బడ్జెట్ కేటాయించ‌డం బ‌హుశా ద‌క్షిణాదిలోనే ఇదే తొలిసారి కావొచ్చు. దాదాపుగా 14 ఎపిసోడ్లుగా శివ‌గామి రాబోతోంద‌ని టాక్‌. అంటే ఒక్కో ఎపిసోడ్‌కి రూన‌.53 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఓ మోస్త‌రు సినిమా బ‌డ్జెట్ ఇది. ఆర్కా మీడియా రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆయ‌న పారితోషికం దాదాపుగా రూ.కోటి రూపాయ‌ల వ‌ర‌కూఉంటుంద‌ని టాక్‌. కాస్త ఖాళీ దొరికిన ద‌ర్శ‌కులు ఇలా వెబ్ సిరీస్‌ల‌వైపు దృష్టి పెట్ట‌డం లాభ‌దాయ‌క‌మేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close