ఈ శతాబ్దం ఇండియాదే…

సిలికాన్ వ్యాలీలో మోడీ ప్రసంగం ప్రవాస భారతీయులను మైమరిపింపచేసింది. ఎస్ ఎ పి హాలులో ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి వచ్చిన వారంతా సహజంగానే ఆయన్ని అభిమానించే వారే అయి ఉంటారు. కాబట్టి హాలులో మోడీ పేరు మార్మోగడం సహజం. అయితే, మోడీ వ్యతిరేకులు కూడా ఆలోచించాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ శతాబ్దం ఆసియాదే అనేది కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న టాక్. కానీ మోడీ తన ప్రసంగంలో మాత్రం ఈ శతాబ్దం ఆసియాది కాదు, ఇండియాది అని నినదించారు. హాలులోని వారూ ఔనంటూ హర్షధ్వానాలు చేశారు.చాలా కాలం తర్వాత భారత్ కు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. అవి కేవలం మోడీ వల్ల వచ్చినవే కావు. ఒక్కోసారి ఒక్కో దేశానికి కొన్ని అంశాలు కలిసి వస్తుంటాయి. పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు కలిసివచ్చింది. అందుకే రెండున్నర శతాబ్దాల పాటు ప్రపంచంలో చాలా భాగం వాటి గుప్పిట్లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్ ఆర్థికంగా నీరసించడం అమెరికాకు కలిసివచ్చింది. అగ్రరాజ్యంగా ఎదిగింది. జపాన్ లో అవినీతి ఆరోపణలతో తరచూ ప్రభుత్వాలు మారడం చైనాకు కలిసి వచ్చింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది.

ఇప్పుడు భారత్ కు చాలా విషయాలు కలసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక రంగంలో చైనా తిరోగమనం మొదలైంది. భారత్ పురోగమనం ఆరంభమైంది. వృద్ధిరేటులో ఇప్పటికే చైనాన్ భారత్ ఓవర్ టేక్ చేసింది. చైనాలో కార్ఖానాలు వేల మంది కార్మికులను తొలగిస్తున్నాయి. భారత్ లో ఇంకా లక్షల మందికి ఉపాధినివ్వడానికి మేకిన్ ఇండియా వంటి అనేక పథకాల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్టుబడులకు సరైన గమ్యస్థానం భారతదేశమే అనే నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. భారత్ పై అందరికీ గౌరవం పెరిగింది. మన దేశంలోని 5 లక్షల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో బ్రాండ్ కనెక్టవిటీ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సరేనంది. 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వై ఫై సేవలకు సహకరించడానికి గూగుల్ ఓకే చెప్పింది. ఈ రెండూ ప్రధాని మోడీ చొరవతో సాధ్యమయ్యాయి. అంతేకాదు, ఇంకా అనేక సిలికాన్ వ్యాలీ కంపెనీలు పెట్టుబడులకు అంగీకరించాయి.

ప్రపంచానికి ఏం కావాలన్నా గూగుల్ లో వెతుకుతుంది. గూగుల్ మాత్రం సమర్థుడైన సి.ఇ,ఒ. కోసం ఇండియాలో వెతికింది. సుందర్ పిచాయ్ రూపంలో సత్తాగల సారథి లభించాడు. దీనికి ఏడాది క్రితమే, మైక్రోసాఫ్ట్ కు మరో భారతీయ రథసారథి లభించాడు. అతడే సత్య నాదెళ్ల. కార్పొరేట్, టెక్నాలజీ ప్రపంచంలో భారత్ పేరు మోత మోగుతోంది. అంతరిక్ష రంగంలో ఇస్రో జోరు మీదుంది. కమర్షియల్ శాటిలైట్ రంగంలో అమెరికాను కూడా అధిగమించింది. సోమవారం నాడు ఒకేసారి ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. వీటిలో నాలుగు అమెరికా ఉపగ్రహాలే. మరోటి కెనడాకు చెందింది. అగ్రరాజ్యంతో సహా అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలను కూడా ప్రయోగించి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఇస్రో శభాష్ అనిపించుకుంటోంది. అతి తక్కువ ఖర్చుతో మంగళ్ యాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఒక్క ఇండియానే కాదు, జి 4 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలంటూ భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అసలు ఐక్యరాజ్య సమితి పాతకాలపు భావజాలంతో ఉందని, దాని మైండ్ సెట్ మారాలని మోడీ ఘాటుగా తలంటారు. ఐరాసలో సంసర్కరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనకు దాదాపు 180 దేశాలు మద్దతు పలికాయి. అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి పెరుగుతోంది. 125 కోట్ల జనాభాతో అతిపెద్ద మార్కెట్ కావడం, 65 శాతం యువ శక్తే ఉండటం భారత్ కు కలిసివచ్చే ఇతర అంశాలు. ఇక, పాక్ దాదాపుగా ఏకాకిగా మారింది. చైనా హవా కూడా తగ్గుతోంది.

క్రీడారంగంలో భారత్ జోరు మీదుంది. ముఖ్యంగా టెన్నిస్ లో సానియా మీర్జా, లియాండర్ పేస్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ తదితరుల హవా నడుస్తోంది.

ఈ సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉందనేదానికన్నా, అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు దూసుకుపోవడం ముఖ్యం. పాశ్చాత్య దేశాలు అలా పనిచేయడం వల్లే అభివృద్ధిని సాధించాయి. అధికార పక్షం, ప్రతిపక్షం, మోడీ సమర్థకులు, విమర్శకులు అనే తేడాలు లేకుండా జాతి మొత్తం ఏకతాటిపై నిలిచి వ్యూహాత్మకంగా పనిచేస్తే మన దేశం చాలా వేగంగా ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు నిజంగానే ఈ శతాబ్దం ఇండియాదే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ రోజున రాపిడో ఉచిత సేవలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. సోమవారం...

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

HOT NEWS

css.php
[X] Close
[X] Close