గుణశేఖర్ పై అందరు కక్ష కట్టారా..?

రుద్రమదేవి స్టార్ట్ చేసినప్పటి నుండి గుణశేఖర్ కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ అండ్ థ్రీడి ఫిల్మ్ గా రాబోతున్న రుద్రమదేవి ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు రుద్రమదేవిని అక్టోబర్ 9న రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు గుణశేఖర్. కాని తెలుస్తున్న కథనాల ప్రకారం మరోసారి తన సినిమాను వాయిదా వేసుకోవాలని ఫిల్మ్ చాంబర్ నుండి గుణశేఖర్ కి మేసేజ్ అందిందట. తన సినిమాకు ఓ వారం అటు ఇటు ఏ సినిమా ఉండకూడదనుకుని ఇన్నాళ్లు ఆగిన గుణశేఖర్ వచ్చి వచ్చి వరుసెంట సినిమాలున్న టైంలో రిలీజ్ చేయడం పెద్ద సాహసమే.

అక్టోబర్ 9న రుద్రమదేవి రిలీజ్ ఎనౌన్స్ చేయగా అదేరోజు అనుష్క సైజ్ జీరో వస్తుంది. ఇక 16న మెగా పవర్ స్టార్ బ్రూస్ లీ కూడా కన్ఫాం అయ్యాడు. ఆ తర్వాత వారం అఖిల్ వస్తున్నాడు. ఇలా వరుసెంట పెద్ద సినిమాలు ఉన్న టైంలో తన సినిమా రిలీజ్ పెద్ద సాహసమే అయినా ఈసారి మాత్రం తగ్గేది లేదంటున్నాడు గుణశేఖర్. రిలీజ్ అవ్వబోతున్న స్టార్ హీరోల దర్శక నిర్మాతల నుండి గుణశేఖర్ మీద ఒత్తిడి మొదలైందట. కాని ఈసారి కూడా కాంప్రమైజ్ అయ్యి గుణశేఖర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తే సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఊరుకునేలా లేరు.

అందుకే ఏదైతే అది అయ్యిందని తెగించి ఎలాగైనా రుద్రమదేవిని అక్టోబర్ 9నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు గుణశేఖర్. మరి గుణశేఖర్ తీసుకున్న ఈ నిర్ణయం స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఏది ఏమైనా ఆడియెన్స్ మాత్రం వచ్చే నెల మొత్తం వెరైటీ సినిమాలతో కనువిందు పొందడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close