తెలంగాణ అసెంబ్లీలో సస్పెన్షన్ రచ్చ – 10న రాష్ట్రబంద్‌

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి సస్పెండ్ చేయడం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు దీనిపై మండిపడ్డారు. అందరూ కలిసి సస్పెన్షన్‌పై సంయుక్తంగా పోరాడటానికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేస్తున్నారు. ఈ నెల 10న రాష్ట్ర బంద్‍‌కు పిలుపునిచ్చారు.

నాలుగు రోజుల విరామం తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశం కాగానే రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, ఆత్మహత్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. కానీ స్పీకర్ మధుసూదనాచారి వాటిని తిరస్కరించారు. దీనితో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, సీపీఐ, సీపీఎమ్, వైసీపీ పార్టీలకు చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దుచేసికూడా రెండు రోజులు రైతు సమస్యలపై చర్చించామని, అలవికాని కోర్కెలు కోరితే తామేమీ చేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము చెప్పిందే జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పారు. మూడోవంతుకూడా లేని సభ్యులు తాము చెప్పిందే జరగాలని అంటే ఎలా అని అన్నారు. ప్రతిపక్షాల తీరు మారకుంటే ఏమి చేయాలో తమకు తెలుసని చెప్పారు. పలుసార్లు స్పీకర్, ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా వారి ఆందోళన ఆగలేదు. దీనితో వారిని ఈ సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. ప్రధాన ప్రతిపక్షనేత జానారెడ్డి, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు, టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, మజ్లిస్ సభ్యులుతప్ప సభలో గొడవ చేస్తున్న 32మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సస్పెన్షన్ అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ శాసనసభపక్షనేత జానారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో ఇది చీకటి రోజని అన్నారు. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్ళు చల్లిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను, తెలంగాణ ప్రజలను అవమానించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మామా అల్లుళ్ళు కలిసి అసెంబ్లీని తమ ఆటవిడుపు కేంద్రంగా మార్చుకున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభాపక్షంలో సమావేశమై ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించారు.

ఏది ఏమైనా ఇంతమంది ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయటం సబబుగా లేదు. గురువారంనాడు శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయనే నెపంమీద సోమవారానికి వాయిదా వేయటంపైనే విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు 32 మంది విపక్ష ఎమ్మెల్యేలను ఏకంగా సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయటం వివాదాస్పదంగా ఉంది. రోజుకు పదిమందికి తక్కువ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ, వ్యవసాయం సంక్షోభస్థాయి సమస్యగా మారితే దానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవటమే తప్పయితే, రుణమాఫీని ఒకేసారి చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేసీఆర్ అలవికాని కోర్కెగా అభివర్ణించటం మరీ అన్యాయంగా ఉందటంలో సందేహంలేదు. అసెంబ్లీని ఇష్టమొచ్చినట్లు వాయిదా వేయించటం, ఇలా సస్పెండ్ చేయటం కేసీఆర్‌ అసహనాన్ని, ఫ్యూడల్ మనస్తత్వాన్ని ఎత్తిచూపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైల్ బయటకు పోకుండా తాళాలు !

తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రుల కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు వాహనాల్లో తీసుకెళ్లిన విషయం గగ్గోలు రేగింది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ...

చిహ్నంలో భాగ్యలక్ష్మి టెంపుల్… బండి ట్వీట్ సారాంశం ఇదేనా..?

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ ఎలాంటి వైఖరిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటే బీజేపీ మాత్రం మౌనం...

డేరాబాబా నిర్దోషి – అన్యాయంగా జైల్లో పెట్టేశారా !?

డేరాబాబా గురించి కథలు కథలుగా దేశమంతా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్దోషి అని హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. తన మాజదీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో...

సజ్జల అల్లర్ల హింట్ – మీనా అరెస్టుల వార్నింగ్

కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి రేపతామని వైసీపీ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుందని పేర్ని నాని ముందే హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లకు సజ్జల కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close