కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎక్సైజ్ సురక్షాయాప్ వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి మద్యం బాటిల్ .. స్కాన్ చేసి అన్ని అనుమతులు ఉన్న కంపెనీలో , ప్రమాణాలకు అనుగుణంగా తయారీ అయిందని నిర్దారించిన తర్వాతే అమ్ముతున్నారు. మద్యం దుకాణాల వద్ద పరీక్షించే ఏర్పాట్లు చేశారు. అంతే వైసీపీ నేతలకు తెరపైకి వచ్చేశారు.
జగన్ హయాంలో కూడా మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్లు ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తీసేసిందని పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. జగన్ రెడ్డి హయాంలో అమ్మిందే ఊరూపేరూ లేరని.. ఇంకెక్కడా అమ్మని మద్యం. అంతా లోకల్ తయారీ. ములకల చెరువు తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి తయారు చేసి వాటినే అమ్మించారు. వాటిపై క్యూ ఆర్ కోడ్స్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఎవరికైనా అనిపిస్తుంది.పైగా ఆ క్యూ ఆర్ కోడ్స్ తో చెక్ చేయడానికి ఏమైనా యాప్ తీసుకువచ్చారా అదీ లేదు. ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నారు.
నకిలీ మద్యం కుట్రలు చేసి.. ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్నారు కానీ.. అడ్డంగా దొరికిపోయారు. అదే సమయంలో అసలు నకిలీ మద్యం అనేది లేకుండా ఉండటానికి కఠిన చర్యలు తీసుకున్నారు. వినియోగదారులకు నమ్మకం కలిగించడానికి యాప్ తీసుకు వచ్చారు. తమ కుట్రలు తేలిపోయినందుకు.. నిండా మునిగిపోయినందుకు.. వైసీపీ కొత్త వితండవాదంతో తెరపైకి వస్తోంది .


