కేసీఆర్‌పై మళ్ళీ రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెచ్చిపోయారు. ఇటీవలి చైనా పర్యటనలో కేసీఆర్ బృందం మకావు వెళ్ళి తాగి తందనాలాడిందని చెప్పారు. కేసీఆర్ బృందం పాస్‌పోర్ట్‌లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సచివాలయంలో బర్త్‌డే పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఇవాళ రైతులకోసం చేపట్టిన దీక్షలో రేవంత్ ప్రసంగించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజలు రజాకార్ల లాగుల్లోకి తొండలు వదిలేవారని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులను అలాగే వేప చెట్లకు కట్టేసి లాగుల్లో తొండలు వదిలిపెట్టాలని అన్నారు. రైతులను ఆదుకోవటానికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావటంలేదని ఆరోపించారు. కేసీఆర్‌ను వదిలించుకుంటే తప్ప భవిష్యత్తు లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. అన్ని పార్టీలూ జెండాలు పక్కన పెట్టి రైతులకోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించటానికి ముందుకొచ్చాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత బయటకొచ్చి రైతులకోసం జోలె పట్టుకోవటంద్వారా తన తండ్రి తాగుబోతు, చేతకానివాడని చెప్పకనే చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు మీడియా కూడా భయపడుతోందని, వాస్తవాలు బయటపెట్టటంలేదని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close