సర్ధార్ లోనూ ఆ ఎపిసోడ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు మైల్ స్టోన్ మూవీగా.. బాక్సాఫీస్ బోనాంజాగా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్. బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు. కథ అదే అయినా తెలుగులో సినిమాను కొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు. దాదాపు కెరియర్ లో హిట్ కొట్టి చాలా ఏళ్లు గడుస్తున్న పవర్ స్టార్ కు.. ఆయన ఫ్యాన్స్ కు ఆ సినిమా పెద్ద ఫీస్ట్. ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ గా సర్ధార్ గబ్బర్ సింగ్ గా రాబోతున్నాడు పవన్ కళ్యాన్.

గబ్బర్ సింగ్ లో విలన్ గ్యాంగ్ చేత పోలీస్ స్టేషన్లో నడిచే అంత్యాక్షరి సీన్ ఆ సినిమాకే హైలెట్.. సినిమా ఓ పక్క ఎమోషన్ని పండిస్తూనే కడుపుబ్బా కామెడీని అందించింది. ఆ సినిమా హిట్ అవ్వడానికి చెప్పుకునే కారణాల్లో అంత్యాక్షరి సీన్ కూడా ఒకటి. ఆ తరహాలోనే ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా వెరైటీ అంత్యాక్షరి సీన్ పెడుతున్నారని టాక్.

అంతేకాదు సినిమాలో ఈ సీన్లో ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఐటం సాంగ్ షూట్ జరుపుకుంటున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవర్ ఫుల్ ఎనర్జీ మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]