కాల్ డ్రాప్స్ కి సర్వీస్ ప్రొవైడర్లు ఇక జరిమానా చెల్లించక తప్పదు

ఇప్పుడు మన దేశంలో కోట్లాది మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. పట్టణాలు, పెద్దపెద్ద నగరాలలో అయితే ఒక్కొక్కరు రెండేసి మూడేసి ఫోన్లు అందులో మళ్ళీ రెండ్రెండు సిమ్ కార్డులు వేసుకొని మరీ వాడుకొంటున్నారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలకి సెల్ ఫోన్ తయారీ సంస్థలకి, సెల్ ఫోన్ తో ముడిపడున్న ప్రతీ దానికి మన దేశంలో మంచి బిజినెస్ ఉంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత తిండి లేకపోయినా భరిస్తారు కానీ చేతిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్లు విలవిల కొట్టుకొంటారు. అటువంటి వారి కోసమే 2జి వచ్చింది. అది పోయి 3జి వచ్చింది. అదీపోయి ఇప్పుడు 4జి కూడా వచ్చేసింది. అయితే వినియోగదారులు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలతో సంతృప్తిగా ఉన్నారా? అంటే లేరనే చెప్పుకోక తప్పదు. కారణం కాల్ డ్రాప్స్!

ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోవడం ఇప్పుడు చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. నానాటికీ కస్టమర్లు, మొబైల్ కనెక్షన్లు పెరుతున్నాయే తప్ప సరయిన నెట్ వర్క్ సిగ్నల్ అందించేందుకు తగినన్ని సెల్ టవర్లను సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటు చేసుకోకపోవడమే వలననే సెల్ టవర్లపై ఒత్తిడి పెరిగి మధ్యలో కాల్స్ కట్ అయిపోతుంటాయి. ఈ సమస్యని కేంద్రప్రభుత్వం చాలా కాలం క్రితమే గుర్తించి సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది, కానీ వారు ఆ హెచ్చరికను పెడ చెవినపెట్టడంతో టెలీఫోన్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా 2016, జనవరి 1 నుంచి ఒక్కో కాల్ డ్రాప్ కి రూపాయి చొప్పున రోజుకి గరిష్టంగా మూడు రూపాయల వరకు వినియోగదారులకు చెల్లించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.

కాల్ డ్రాప్ అయిన 4 గంటలలోగా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారుడికి దానికి తాము జరిమానా చెల్లిస్తున్నట్లు ఎస్.ఎం.ఎస్. మెసేజ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు జరిమానాకు సరిపోయేంత సమయం కలపడం ద్వారా, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తరువాత బిల్లులో ఆ మొత్తాన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వారు జరిమానా చెల్లిస్తున్నారో లేదా అని ట్రాయ్ నిత్యం గమనిస్తుంటుంది. చెల్లించకుండా ఎగవేస్తున్న వారిపై మళ్ళీ అదనంగా జరిమానా విధిస్తుంది. ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలశ్యం అయినప్పటికీ వినియోగదారుడికి మేలు చేకూర్చే నిర్ణయమే తీసుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close