ప్యారిస్‌కు మహేష్

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీతో సహా ప్యారిస్ వెళుతున్నారు. దసరా సెలవులను సకుటుంబంగా ప్యారిస్‌లో గడపబోతున్నారు. ఈఫిల్ టవర్ చూడాలని గౌతమ్ కొన్నాళ్ళుగా అడుగుతున్నాడట. ప్రస్తుతం గౌతమ్, సితార ఇద్దరికీ స్కూల్‌కు దసరా సెలవులు కావటంతో గౌతమ్ కోరిక తీర్చటానికి ఇదే మంచి టైమ్ అని భావించి ప్యారిస్ టూర్‌కు ఏర్పాట్లు చేసుకున్నామని నమ్రత ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవలే బ్రహ్మోత్సవం రెండో షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ తదుపరి షెడ్యూల్ ప్రారంభమయ్యేలోపు గ్యాప్‌లో ప్యారిస్ వెళ్ళి వస్తారు. తిరిగొచ్చిన తర్వాత మురుగదాస్ ప్రాజెక్ట్‌పై ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌‌లో ప్రారంభిస్తారని తెలిసింది. ఏదో ఒక సామాజిక అంశం ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు చేసే మురుగ మహేష్ సినిమాకు కూడా ఒక సామాజిక అంశాన్ని తీసుకుంటాడని సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close