టచ్ చేయాలంటే తడిసి పోవాల్సిందే.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్

కృష్ణం రాజు నట వారసత్వాన్ని చేతపట్టి రికార్డుల మోత మోగిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ తో మొదలైన ఆ ప్రస్థానం నిన్నటి బాహుబలి వరకు అద్భుతంగా సాగింది. మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేసిన ప్రభాస్ తన సినిమాలతో వారిని అలరించడం స్టార్ట్ చేశాడు. ఈశ్వర్ హిట్ తో కుర్రాడు మంచి కసి మీదున్నాడు కదా అనుకునే సరికి వర్షం హిట్ తో స్టార్ స్టేటస్ కి ఎగబ్రాకాడు. ఇక జక్కన్న చేతిలో పడి చత్రపతిగా అవతరించి బాక్సాఫీస్ బాద్షాగా మారాడు ప్రభాస్.

సినిమా సినిమాకు నైపుణ్యతను జోడిస్తూ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ను పరిశ్రమలో అందరు డార్లింగ్ అని అంటుంటారు. ప్రభాస్ లోని మరో కోణాన్ని చూపించిన సినిమాలు చక్రం, పౌర్ణమి. ఇక బుజ్జిగాడుగా ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్ తన నిక్ నేమ్ అయిన డార్లింగ్ సినిమాతో అందరిని అలరించాడు. కొత్త రకం క్యారక్టరైజేషన్ కి ప్రాధాన్యతనిచ్చే ప్రభాస్ ఎప్పుడు ప్రయోగాలకు ముందుంటాడు.

ఇక బాహుబలితో అయితే తన అభిమాని అని చెప్పుకునే వారిని తల ఎత్తుకుని గర్వపడేలా చేశాడు ప్రభాస్. అమరేంద్ర బాహుబలి, శివుడు క్యారక్టర్స్ లో ప్రభాస్ నటన అనిర్వచనీయం అందుకే దేశమంతా మెచ్చుకుంది. తను క్రియేట్ చేసిన బాక్సాఫీస్ రికార్డులను టచ్ చెయాలంటే తడిసిపోయేలా చేశాడు ప్రభాస్. బాహుబలి సినిమా కోసం తన కెరియ నే ఫణంగా పెట్టిన ప్రభాస్ ఆ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా రెండవ భాగాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారుచిత్ర యూనిట్.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన డార్లింగ్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్లు మరెన్నో వచ్చి కెరియర్ అంతా సూపర్ సక్సెస్ఫుల్ గా సాగిపోవాలని కోరుకుంటుంది తెలుగు360.కామ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close