మోడీ మౌనానికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజిల ప్రస్తావన చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఇతర విషయాల గురించి మాట్లాడటం, రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహాయసహాకారాలు అందజేస్తామనే హామీని పునరుద్ఘాటించి వెళ్లిపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తి, నిరాశ, ఆగ్రహం చెందుతున్నారు. ఇంతకు ముందు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను, వారి అభీష్టాన్ని పట్టించుకోకపోవడం వలననే అందుకు అది భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. తమ పార్టీ చేసిన కొన్ని పొరపాట్ల కారణంగానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మరిప్పుడు బీజేపీ మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేస్తోంది? చేస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పవచ్చును.

ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు. హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ తప్పకుండా ఇస్తామని చెప్పి ఆరు నెలలయింది. కనుక మోడీ నిన్న ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అది అత్యాశేమీ కాదు. కానీ మోడీ ఆ ఒక్కదాని గురించి తప్ప మిగిలిన అని విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు తన హామీల గురించి గుర్తు చేసి సభా ముఖంగా అడిగినా మోడీ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలు చాలా నిరాశ చెందారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ, ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారనే విషయం గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే చివరికి నష్టపోయేది వారే. అందుకు కాంగ్రెస్ పార్టీ మన కళ్ళెదుటే సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ విషయంపై ప్రధాని మోడీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీపై ఎటువంటి ప్రభావం చూపించలేకపోవచ్చును. కానీ అది చంద్రబాబు ప్రభుత్వంపై ఆ ప్రభావం చూపవచ్చును. ఈ విషయంలో మోడీ మౌనానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా మూల్యం చెల్లించవలసి వస్తుంది. బీజేపీతో పొత్తులు నిలుపుకొనేందుకే తెదేపా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతోందని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేని పరిస్థితి వారి ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కనుక నేటి నుండి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించవచ్చును. వాటిని ఆయన ఏదో విధంగా ఎదుర్కోవచ్చును…కానీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవడమే కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close