వరంగల్ పై తెరాస టెన్షన్… టెన్షన్ !

ఉప ఎన్నిక నగారా మోగిన వరంగల్ లో గెలవడం ఎలా అనేది తెరాసకు సవాలుగా మారింది. 2014 ఎన్నికల నాటికి, ఇప్పటికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఊపు తగ్గడం కాదు, అసలు ఊపే కనిపించడం లేదు. ప్రజల్లోనే కాదు, తెరాస శ్రేణుల్లోనూ పెద్దా ఉత్సాహం కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.

ఒంటిచేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడిగా, పార్టీని అధికారంలోకి తెచ్చిన సారథిగా జయజయ ధ్వానాలు అందుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ 17 నెలల్లో చాలా మార్పు వచ్చింది. వరంగల్ కు సంబంధించినంత వరకూ, ఇప్పుడు కేసీఆర్ రాకను ఓ పండుగలా ప్రజలు ఫీలయ్యే పరిస్థితి లేదు. వరంగల్ కు ఆయన ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమే దీనికి కారణం.

ఈ ఏడాది జనవరిలో కేసీఆర్ వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. మురికి వాడల పర్యటనకు పోయి ఆశ్చర్యపోయారు. ఇవి ఇండ్లా, వీటిలో మనుషులుంటరా అని ముక్కుమీద వేలేసుకున్నారు. ఆగమేఘాల మీద జీ ప్లస్ 1 డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను నాలుగైదు నెలల్లో కట్టిస్తాననగానే పాపమా మురికి వాడల ప్రజలు చప్పట్లు కొట్టారు. త్వరలోనే కొత్తింట్లో దావత్ చేసుకుందామని కేసీఆర్ చెప్పగానే హర్షధ్వానాలు చేశారు. పదినెలలు గడిచినా అతీ గతీ లేదు. పక్కాఇండ్ల ఊసే లేదు.

మహా గొప్పగా వరంగల్ ను గ్రేటర్ కార్పొరేషన్ గా ప్రకటించారు. అందుకు ఏమాత్రం అర్హత లేని నగరానికి ఓ భుజకీర్త తగిలించడానికి చుట్టుపక్కలున్న గ్రామాలను కార్పొరేషన్లో కలిపేశారు. పంచాయతీల్లో తక్కువ పన్నులు కట్టే వేల మంది ప్రజలు ఇప్పుడు కార్పొరేషన్లో భాగమైనా పరిస్థితి మారలేదు. అద్దాల్లాంటి రోడ్లూ లేవు. అధునాతన సౌకర్యాలూ లేవు. పైగా, వరంగల్ కు కేసీఆర్ ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు హామీ కూడా తూచ్ అవుతుందనే టెన్షన్. ఇక, భారీ వ్యయంతో కాళోజీ కళా భవనాన్ని నిర్మిస్తానన్న కేసీఆర్ హామీ అలాగే ఉంది. కళా భవనం అడ్రస్ లేదు.

ఒకటా రెండా, హైదరాబాదుతో పోటీగా వరంగల్ మహా నగరమై పక్కా ఇండ్లు, బ్రహ్మాండమైన రోడ్లు, ప్రజలకు స్వర్గంలాంటి జీవితం ఖాయమనే తరహాలో తెరాస నేతలు ఊరించారు. ఉసూరుమనిపించారు. రేపు తెరాసకు ఓటడగటానికి పోయినప్పుడు, 17 నెలల్లో ఏంచేశారని ప్రజలు అడిగితే జవాబు ఏదీ? ఇదే గులాబీ కేడర్ ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, మిషన్ కాకతీయ, జలహారం వగైరా పథకాల గురించి వివరించే అవకాశం ఉంది. కానీ వాటి వల్ల ప్రత్యక్షంగా వరంగల్ ప్రజలు ఏమేరకు ఒరిగిందనేది ప్రశ్న. తెరాస నేతలు చాలా మందిలో అధికార మైకం అధికమైంది. రూలింగ్ పార్టీ అనే ఎఫెక్ట్ కనిపస్తోంది. ఇష్టారాజ్యం చెలాయించడం అతి అయింది. కొందరు నేతలు మాత్రమే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పార్టీ క్రెడిబిలిటీని పెంచడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. కానీ పార్టీకి చెడ్డపేరు తెచ్చే వారి దెబ్బకు వీరి ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందనే అనుమానం కూడా ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రజలకు వీలైనంత దూరంగా ఉన్నారనే విమర్శ కూడా ఉంది. వారి వల్ల వచ్చే ఓట్లు పోతాయేమో అని కార్యకర్తలు కలవరపడుతున్నారు.

ఉప ఎన్నికలో ఒకవేళ ఓడితే అది తెరాస ప్రభుత్వానికి నైతికంగా ఓటమి అని ప్రతిపక్షాలు తీవ్రంగా దాడి చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కేడర్ స్థయిర్యం దెబ్బతింటుంది. ఇక తమ పని అయిపోయిందనే భావన మొదలవుతుంది. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం రాదనే నిరాశ ఆవరిస్తే ప్రమాదం. కాబట్టే, ఆర్థికంగా అత్యంత బలవంతుడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close