పోరు బాటలో సీమ నేతలు?

అన్యాయాలకు, వివక్షకు వ్యతిరేకంగా రగులుతున్న రాయలసీమ రాజకీయ శక్తుల పునరేకీకరణకు దారిచూపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరే ఈ పోలరైజేషన్ పరిణామాలను వేగవంతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వచ్చి రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించాలని డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి భావిస్తున్నారు. ఈయనతోపాటు మాజీ మంత్రి డాక్టర్ డీఎల్‌ రవీంద్రారెడ్డి, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంవీ రమణారెడ్డి కూడా జత కలిసే అవకాశాలున్నాయి. రాయలసీమ లో విడివిడిగా పని చేస్తున్న సుమారు 25 సంఘాలు, సంస్ధలు, వ్యక్తులను ఒకే తాటిపైకి తెచ్చే కార్యక్రమాల గురించి మైసూరా రెడ్డి తన సహచరులతో చర్చిస్తున్నారు.

రాయలసీమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి కూడా నచ్చడంలేదు. ”రాయలసీమ బిడ్డే అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గత సీమ ముఖ్యమంత్రుల మాదిరిగానే ఓట్లు, సీట్లు లెక్కలతోనే పనిచేస్తున్నారు. అంతేకాకుండా తక్కువ సీట్లు ఇచ్చిన రాయలసీమ మీద చంద్రబాబు ఒక విధమైక కక్ష పెంచకున్నారు” అని మిత్రులు, సహచరులు, అనుచరుల సమావేశాల్లో కెఇ అనేకసార్లు వ్యాఖ్యానించారు.” కోస్తా వారు తనను ఆదరించారని, సొంత వాళ్లు అండగా నిలవనప్పటికీ తాను ఈ ప్రాతాన్ని అభివృద్ధి చేస్తాను” అని చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో చెప్పిన విషయాన్ని రిఫర్ చేసి సిఎం మనసులో రాయలసీమపై నిష్టూరం వుందనడానికి ఆయన మాటలే సాక్ష్యాలని కూడా ఒక సమావేశంలో కెఇ వ్యాఖ్యానించారని తెలిసింది.

సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాయలసీమ వారే అయినా సొంత ప్రాంతానికి వారు వొరగబెడుతున్నది ఏమీ లేదనే భావన సర్వత్రా వుంది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే పాతిక వరకూ సంస్ధలు ప్రజల్ని చైతన్య పరుస్తున్నాయి. ఇందుకు కమ్యూనికేషన్ సాధనంగా సోషల్ మీడియా అద్భుతంగా వుపయోగపడుతోంది. ఈ ప్రభావం అధికారంలో వున్న చంద్రబాబుకి వ్యతిరేకంగా పటిష్టమౌతోంది.

తిరుపతి శ్రీపద్మావతి వైద్యకళాశాలలో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా విద్యార్థినులకు 85 శాతం సీట్లు అంటే 107, నాన్‌ లోకల్స్‌కు 18, ఎన్‌ఆర్‌ఐలకు 25 సీట్లు కేటాయించారు. అయితే 2014, ఆగస్టు 23న జారీ చేసిన జీఓ 120 వల్ల కేవలం పది సీట్లు మాత్రమే రాయలసీమకు మిగిలాయి. దీనిపై సుప్రీం కోర్టులో ఒక అభ్యంతరం దాఖలుకాగా మరో పది మందికి మాత్రమే సీట్లు లభించాయి. మిగిలిన సీట్లు కోస్తా వారికి లభించాయి. అంటే 107 సీట్లకు గాను పట్టుమని 20 సీట్లు దక్కాయి. ఈ ప్రాంత వాసులు 97 సీట్లను పోగొట్టుకు న్నారు. అందరికీ తెలిసీ ఇంత వంచన జరిగిందని, తెలియక ఇంకెన్ని విధాలుగా మోసపోతున్నామోననే అనుమానం, భయాందోళనలు ఈ ప్రాంత వాసుల్లో నాటుకున్నాయి.

శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలనే నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించకోలేదు. ఫలితంగా చిన్న చిన్న రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు లేకుండా పోయాయి.

రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.550 కోట్లు కేటాయించారు. అదే పట్టిసీమకు రూ.1600 కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం ఈ ప్రాంత రైతాంగానికి మింగుడు పడని విషయం. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు సంబంధించి 12 పంపుసెట్లలో ఒకదాన్ని పట్టిసీమకు తీసుకెళ్లి అమర్చడం కూడా ఆగ్రహం తెప్పిస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయ ఆధారిత జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం ఇదే జిల్లా నుంచి ఐదు లక్షల మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని సుగాలితాండాల మహిళలు పొట్ట నింపుకునేందుకు ఢిల్లీ, ముంబయి, పూణే తదితర నగరాల్లోని రెడ్‌లైట్‌ ఏరియాలకు తరలిపోవడం మరో విషాదం.

1937, నవంబర్‌ 16 న కుదుర్చుకున్న ‘శ్రీబాగ్‌’ ఒప్పందాన్ని యధాతధంగా అమలు చేస్తే రాయలసీమకు ఈ సమస్యలు వుండేవి కాదని ఆప్రాంత ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు సర్వశక్తులనూ కూడగట్టి తలపెట్టిన అమరావతి నిర్మాణం రాయలసీమ వాసులకు ఆమోదయోగ్యంగా లేదు. తమ ప్రాంతంపై ప్రభుత్వ వివక్షను ఎదిరించి పోరాడటానికి 78 ఏళ్ళ నాటి ”శ్రీబాగ్” ఒప్పందాన్నే ఆయుధంగా తీర్చిదిద్దుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close