అఖిల్ సినిమా రిలీజ్ అయ్యిందట..!

టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజన్ అయినట్టు ఉన్నారు కదా.. ఈ నెల 11న దీపావళి కానుకగా రిలీజ్ అవ్వబోతున్న అఖిల్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అవ్వడమేంటని ఆశ్చర్యపోకండి. పెద్ద కొడుకు స్టార్ ఎంట్రీ ఇచ్చినా మాస్ ఇమేజ్ ఏర్పాటు చేసుకోలేకపోయాడని కాస్త వేదనలో ఉన్న నాగ్ చిన్న కొడుకు అఖిల్ ని భారీ రేంజ్ లో డెబ్యూ ప్లాన్ చేశాడు. అఖిల్ సినిమాకు ముందునుండి జాగ్రత్తలు తీసుకుంటున్న నాగ్ సినిమా రిలీజ్ విషయంలో కూడా అందరికి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడట.

సినిమా అధికారికంగా ఈ నెల 11న దీపావళి కానుకగా రిలీజ్ అవుతుండగా ఆ రోజు అమావాస్య కారణంగా సినిమాకు బ్యాడ్ సెంటిమెంట్ అని భావించి ఈ నెల 6నాడే సినిమాను అక్కినేని కుటుంబం కోసం స్పెషల్ స్క్రీనింగ్ తో రిలీజ్ చేశాడట కింగ్ నాగార్జున. అఖిల్ సినిమా మొదటి షో అదే అని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అఖిల్ సినిమా మొదటి టికెట్ 1000 రూపాయలకు నాగసుశీల కొన్నారట. అత్త చేతి చలువతో సినిమా సూపర్ హిట్ అవ్వాలను కోరుకుంటున్నాడు అఖిల్.

అయితే రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా ముమ్మ్రరం చేశారు చిత్ర యూనిట్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న అఖిల్ సినిమాను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, థమన్ మ్యూజిక్ అందించడం జరిగంది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న నాగ్, అఖిల్ ని స్టార్ హీరోగా నిలబెట్టగలుగుతాడా లేదా అన్నది భవిష్యత్ లో తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close