‘ఊపిరి’ సినిమా రిలీజ్ ఫిక్స్..!

కింగ్ నాగార్జున, కార్తి, తమన్నా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఊపిరి.. అనుష్క గెస్ట్ రోల్ చేస్తున్న ఈ సినిమా చాలా వరకు యూరప్లో షూటింగ్ జరుపుకుంది. ఫ్రెంచ్ మూవీ ‘ఇన్ టచబుల్స్’ కి అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మల్టీస్టార్ సినిమాగా రాబోతున్న ఊపిరిలో కింగ్ నాగార్జున వీల్ చైర్ లో కనిపించి అలరించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.

నాగ్, కార్తి మల్టిస్టారర్ గా వస్తున్న ఊపిరిలో వీరిద్దరి మధ్య సీన్స్ అందరిని ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడట డైరక్టర్ వంశీ పైడిపల్లి. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు చిత్ర యూనిట్. ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోపు కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా రిలీజ్ అవ్వనుంది. ఆ సినిమా డిశెంబర్లో రిలీజ్ అవుతుందని అంచనా.

సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కి మంచి గ్రిప్ ఉంది. ఆ తరహాలోనే ఊపిరి సినిమా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు వంశీ. సినిమా చూసిన ఆడియెన్స్ మంచి అనుభూతిని కలిగించే విధంగా సినిమాను రూపుదిద్దుతున్నాడు. మల్టిస్టారర్ సినిమాలు ఊపందుకున్న ఈ టైమ్లో భారీ అంచనాలతో వస్తున్న ఊపిరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com