ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే మోడీ మంత్రం కూడా పనిచేయదా?

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా బిహార్ లో బీజేపీ ఓడిపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలే ఉన్నాయి. అటువంటి అనేక కారణాలలో ఒకటి ప్రజలపై ప్రాంతీయ పార్టీల ప్రభావం. గత మూడు శతాబ్దాలుగా దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా చాలా బలమయిన ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చేయి. మొదట్లో వాటిని ప్రజలు పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రజలపై వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒకానొక సమయంలో దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలను కాదని మనుగడ సాగించలేమని గ్రహించి, యూపియేని ఏర్పాటు చేసుకొని వాటితో పొత్తులు పెట్టుకొని అధికారం నిలబెట్టుకొంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఈ విషయం చాలా ఏళ్ల క్రితమే గుర్తించి ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసుకొని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఎన్నికలలో ప్రాంతీయపార్టీల ప్రభావం గురించి కాంగ్రెస్, బీజేపీలకు కూడా తెలుసు. కానీ బిహార్ రాష్ర్టంలో బీజేపీ బలంగా నిలద్రొక్కుకు పోవడం చేతనే ఆ పార్టీ మోడీ పాపులారిటీ మీద ఆధారపడవలసి వచ్చింది.

బిహార్ లో బీజేపీ ఓడిపోయిననంత మాత్రాన్న కొంపలు అంటుకోవు. కానీ ఈ ఎన్నికలలో బీజేపీ మోడీ పేరు చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగి భంగ పడటం చేతనే బీజేపీకి ఎక్కువ నష్టం కలుగుతోందిని చెప్పవచ్చును. ఇదే అదునుగా కాంగ్రెస్ మరియు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఇక దేశంలో బీజేపీ పని అయిపోయిందని ప్రచారం చేయడం మొదలుపెట్టేసాయి. వాటికి ఆ అవకాశం కల్పించింది బీజేపీయే. కానీ ఒకవేళ బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి ఉంటే, అప్పుడు మాత్రం వేరే ఇతర కారణాల చేతనే బీజేపీ గెలిచింది తప్ప మోడీ ప్రభావం వలన కాదు ఆ విజయం మోడీ అభివృద్ధిని చూసి వేసింది కాదని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చెప్పుకొని ఉండేవి.

వచ్చే ఏడాది నుంచి వరుసగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మొదలయిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దేశంలో మోడీ వ్యతిరేకత పెరిగిపోతున్న కారణంగానే బీజేపీ మున్ముందు జరుగబోయే ఎన్నికలలో ఓడిపోతుందని కాంగ్రెస్ మరియు బీజేపీ వ్యతిరేక శక్తులు జోస్యం చెపుతున్నాయి. కానీ అవి ప్రజలను తప్పు దోవ పట్టించడానికే ఆవిధంగా మాట్లాడుతున్నాయి. ఆయా రాష్ట్రాలలో బీజేపీ కంటే ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా పాతుకుపోయున్నాయి. వాటిని బీజేపీయే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసి ఓడించలేదు. అందుకే వాటితో పొత్తులు పెట్టుకొంటోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలు బలంగా పాతుకుపోయి ఉన్నాయి. అవికాక ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రజలపై వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కనుక వాటన్నిటినీ డ్డీ కొని బీజేపీ గెలవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. ఆ రాష్ట్రాలలో బీజేపీకి బలం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును.

కనుక ఆ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో గెలవాలంటే ఇప్పటికిప్పుడు బీజేపీని బలపరుచుకోవడం సాధ్యం కాదు కనుక, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలలో ఒక బలమయిన పార్టీతో బీజేపీ పొత్తులుపెట్టుకోవడం ద్వారా బీజేపీ తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చును. ఆలా కాదని మళ్ళీ అక్కడ కూడా మోడీ జపం చేసి గెలిచేద్దామని చూసి భంగపడితే, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తప్పకుండా చాలా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close