నిర్మాత‌ల హీరో, వ‌ర్క్ హాలిక్‌…నారా రోహిత్‌

తొలిచిత్రం ‘బాణం’ నుండి విల‌క్ష‌ణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. ‘సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర’ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తూ అందులో కొత్త టెక్నిషియ‌న్స్‌, ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు. నారా రోహిత్ ప్ర‌స్తుతం ‘రాజా చెయ్యివేస్తే’, ‘సావిత్రి’ సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. ‘రాజా చెయ్యివెస్తే’ సినిమా నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో సాయికొర్ర‌పాటి నిర్మాత‌గా వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై రూపొందుతుండ‌గా, ‘సావిత్రి’ సినిమావిజ‌న్ ఫిలింమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ నిర్మాత‌గా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాలు ఓకే స‌మ‌యంలో జ‌రుగుతుండటంతో నారా రోహిత్ ఉద‌యం ఆరు గంట‌ల నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు ‘రాజా చెయ్యివేస్తే’ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. అలాగే సాయంత్రం ఆరు గంట‌ల నుండి మ‌రుసటి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌ వ‌ర‌కు ‘సావిత్రి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నారా రోహిత్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌టం ఆయ‌న‌కు సినిమా ప‌ట్ల ప్యాష‌న్‌, డేడికేష‌న్‌ను తెలియ‌జేస్తున్నాయి. నిర్మాత‌ల మేలు కోరే ఇలాంటి హీరోలే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి కూడా అవ‌స‌రం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close