గణేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్

కమెడియన్ గా ఉంటూనే సడెన్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా అవతరించాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన గణేష్ ప్రస్తుతం లవర్ బోయ్ నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. టెంపర్ తర్వాత ఏ సినిమా చేయని బండ్ల గణేష్ ఎట్టకేలకు నితిన్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండే గణేష్ నిర్మాణంలో నితిన్ చేయడం మంచి విషయమే.

ప్రస్తుతం నితిన్ త్రివిక్రం ‘అ..ఆ’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతతో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నితిన్ గణేష్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా దర్శకుడు ఎవరు అన్నది మాత్రం డిసైడ్ అవ్వని ఈ సినిమా త్వరలో డైరక్టర్ ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్న ఈ సినిమా గురించి మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరనేది త్వరలో వెళ్లడవుతుంది.

రీసెంట్ గా వచ్చిన కొరిబోయ్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నితిన్ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే తండ్రి స్థాపించిన శ్రేష్ఠ్ మూవీస్ యెక్క భాధ్యతను కూడా తన మీద వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ దారిలోనే మొదటి ప్రయత్నంగా తీసిన అఖిల్ డివైడ్ టాక్ తెచ్చుకున్నా సినిమా ఓవరాల్ గా కాన్ స్టంట్ కలక్షన్స్ సాధించడం జరుగుతుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com