నిజామాబాద్ లో మెగా ఫుడ్ పార్క్

కేంద్ర పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి లో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్‌పార్కు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో బాటు కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 80 ఎకరాలలో ఏర్పాటు చేయబోయే ఈ మెగా ఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. దీనికి అనుబందంగా నల్గొండ, మేడ్చల్, మెదక్‌ జిల్లాలలో రూ.362 కోట్లతో ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయబడతాయి.

ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ “ఇప్పుడు దేశంలో పరిశ్రమల స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఏళ్ల తరబడి ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకొన్న రెండు మూడు వారాలలోనే పరిశ్రమలను బట్టి అన్ని రకాల అనుమతులు మంజూరు అవుతున్నాయి. అలాగే శంకుస్థాపన చేసిన ఏడాదిలోగానే అనేక పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించగలుగుతున్నాము. ఈ మెగా ఫుడ్ పార్క్ కూడా సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రారంభోత్సవానికి సిద్దం అవుతుందని ఆశిస్తున్నాను. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తోంది. ప్రత్యేకంగా వాటి కోసమే రూ. 2, 000 కోట్ల నాబార్డు నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ సహాయసహకారాలను, ప్రోత్సాహకాలను దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వినియోగించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పాలని” ఆమె కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close