కుమారిని కాపీ అంటున్నారండి

సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన సినిమా కుమారి 21ఎఫ్. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుంటుంది. యూత్ ని బేస్ చేసుకునే ఈ కథ రాసుకున్న సుకుమార్ సినిమాను వారికి దగ్గరకు చేర వేయడంలో సక్సెస్ అయ్యాడు. సుకుమార్ నిర్మాతగా సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి షో నుండి మంచి టాక్ తెచ్చుకుని కలక్షన్స్ కుమ్మేస్తుంది. అయితే సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా లేదని విమర్శలు వస్తున్నా వాటినేమి పట్టించుకోవట్లేదు సుక్కు.

సుకుమార్ ఈ సినిమాలో కొన్ని సీన్లు కాపీ కొట్టాడంటూ రచ్చ చేయడం మొదలెట్టారు నెటిజెన్లు. సినిమా మాధ్యమాలు బాగా ఎక్కువయ్యే సరికి ప్రతి హాలీవుడ్ సినిమా చూసే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకే ఏ సినిమా దేన్ని పోలీ ఉంది… ఏ సీన్లు ఎక్కడ నుండి కాపీ చేశారని ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ప్రస్తుతం కుమారికి సంబంధించిన సీన్లు కూడా రెండు హాలీవుడ్ సినిమాల నుండి లేపేసినవంటూ చెప్పుకుంటున్నారు.

కుమారిలో కొన్ని సీన్లు ‘లీలా సేస్’ అనే సినిమాలోవి పోలీ ఉండగా.. ఇక క్లైమాక్స్ ను మాత్రం ‘ది సీక్రెట్ ఇన్ దెర్ ఐస్’ సినిమా నుండి యాజిటీజ్ దించాడని అంటున్నారు. సుకుమార్ మాత్రం వీటన్నీటి గురించి ఆలోచించకుండా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close