ఒక్క హిట్ పడితే సుధీర్ స్టార్ హీరో అయిపోతాడు – మహేష్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు..ఎస్.ఎం.ఎస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కథానాయకుడు తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ అయితే క్రియేట్ చేసుకున్నాడు కాని సినిమాలను మాత్రం కమర్షియల్ గా హిట్ చేసుకోలేకపోతున్నాడు. ఈ ఇయర్ వచ్చిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా బాగున్నా రిలీజ్ టైం సరిగా లేక యావరేజ్ గా మిగిలిపోయింది.

ప్రస్తుతం సుధీర్ చేస్తున్న సినిమా భలే మంచి రోజు.. ఒక్క రోజు జరిగే సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. రీసెంట్ గా టీజర్ తో షాక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిధిగా వచ్చిన ఈ ఆడియో కార్యక్రమంలో పలువురు సిని ప్రముఖులు హాజరయ్యారు. సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. సుధీర్ హార్డ్ వర్క్ చాలా బాగుంటుందని.. ఒక్క కరెక్ట్ సినిమా పడితే అతని స్టార్ అవుతాడని అన్నాడు మహేష్.

సినిమా డైరక్టర్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కచ్చితంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని మహేష్ అన్నారు. సూపర్ స్టార్ అభిమానుల కోలాహలంలో హంగామాగా భలే మంచి రోజు ఆడియో వేడకు జరిగింది. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఈ సినిమా త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close