ప్రిథ్వీ-2 మిస్సైల్ పరీక్ష విజయవంతం

డిఫెన్స్ రీసెర్చ్ మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ.) తయారుచేసిన ప్రిథ్వీ-2 మిస్సైల్ భారత ఆర్మీ అమ్ములపొదిలో ఒక ముఖ్యమయిన అస్త్రం. దీనిని 2003లో భారత ఆర్మీకి అప్పగించారు. అప్పటి నుండి దానిని భారత ఆర్మీలోని స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, డి.ఆర్.డి.ఓ. అధికారులు కలిసి అపుడప్పుడు ప్రయోగించి దాని సామార్ధ్యాన్ని, యుద్ద సన్నదతను పరీక్షించి చూసుకొంటున్నారు. అదే సమయంలో దానిని ఏవిధంగా ప్రయోగించాలనే విషయంలో సంబంధిత అధికారులు శిక్షణ పొందుతుంటారు. ఆర్మీకి అందించిన ఈ రకానికి చెందిన అనేక మిసైళ్ళలో నుండి ఏదో ఒకదానిని తీసుకొని ఈవిధంగా పరీక్షించి చూసుకొంటారు. తద్వారా తమ వద్ద అన్ని మిసైల్స్ యుద్ద సన్నదత కలిగి ఉన్నాయని దృవీకరించుకొంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన దానిని పరీక్షించి చూసారు. మళ్ళీ ఈరోజు ఓడిశాలోని చాంద్ పూర్ సమీపంలో గల మిసైల్ టెస్ట్ రేంజ్ నుండి మధ్యాహ్నం 12.10 గంటలకు పరీక్షించి చూసారు. ఆ పరీక్షలో అది నూటికి నూరు శాతం విజయవంతం సాధించిందని అధికారులు తెలిపారు.

ఈ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటంటే: ఇది సుమారు 350 కిమీ దూరంలో లక్ష్యాలను అవలీలగా చేదించగలదు. 500-1000 కేజీలు బరువున్న అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. లక్ష్యాన్ని బట్టి తన దిశను మార్చుకోగలదు. ఇది ఉపరితలం నుండి ఉపరితలంపైకి అంటే ‘సర్ఫేస్ టు సర్ఫేస్’ ప్రయోగించే అత్యంత శక్తివంతమయిన ఆయుధం. దీనికి ద్రవ ఇంధనంతో నడిచే రెండు అత్యంత శక్తివంతమయిన ఇంజన్లు ఉంటాయి. ఇది పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇంతవరకు జరిపిన పరీక్షలలో నూటికి నూరు శాతం విజయాలు సాధించింది.

ఈరోజు పృథ్వీ-2 మిసైల్ ను ప్రయోగించిన తరువాత ఓడిశా సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన మిసైల్ ట్రాకింగ్ రాడార్స్, ఎలెక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్, టెలి మెట్రీ వ్యవస్థలు దాని గమనమ, వేగం తదితర నిర్దేశిత సాంకేతిక అంశాలను అన్నిటినీ నిశితంగా గమనించాయి. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన ఒక నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదిస్తున్నపుడు దానికి కొంత దూరంలో ఒక షిప్పులో నుండి దానిని పరిశీలించిన ఆర్మీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close