రాంగోపాల్‌వర్మ పేరుతో కాక్‌టైల్!

హైదరాబాద్: హారర్, థ్రిల్లర్ సినిమాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన రాంగోపాల్ వర్మ పేరుతో ఇప్పుడొక కాక్‌టైల్ వచ్చింది. జుబ్లీ హిల్స్‌లోని కాక్‌టైల్ లాంజ్ రెస్టారెంట్ ఆర్‌జీవీ పేరుతో ఆర్‌జీవీ ఎలిక్సిర్ అనే కొత్త కాక్‌టైల్‌ను రూపొందించింది. దీనిని నిన్న రాత్రి వర్మే ఆవిష్కరించారు. ప్రతి తెలుగువాడూ గర్వించే జాతీయస్థాయి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు గౌరవ సూచకంగా దీనిని ఆవిష్కరిస్తున్నట్లు లాంజ్ యాజమాన్యం తెలిపింది. ఆయన పేరుతో ఈ కాక్‌టైల్ ఆయన చేతులమీదుగా ప్రారంభం కావటం తమకు గర్వకారణంగా ఉందని పేర్కొంది. ఈ కాక్‌టైల్ తొలిగ్లాస్‌ను వర్మే అందుకున్నారు. తనపేరిట కాక్‌టైల్ మిక్స్ చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యం కలిగిందని వర్మ చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి, కోన వెంకట్, బ్రహ్మాజీ, నిఖిల్, సందీప్ కిషన్, నవదీప్, రాజ్ తరుణ్, నందు, బీవీఎస్ రవి, పృథ్వీ, సత్యం రాజేష్, సప్తగిరి, రాజా రవీంద్ర, శ్రీనివాసరెడ్డి, లగడపాటి శ్రీధర్, మధుశాలిని, తేజస్వి, నికిత, స్వాతి, అనితా చౌదరి, గజల్ శ్రీనివాస్, సుబ్బరాజు, మధురా శ్రీధర్, రఘు కుంచె, జర్నలిస్ట్ సిరాశ్రీ, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మామూలుగా రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్‌లకు స్క్రూడ్రైవర్(ఓడ్కాతో ఆరెంజ్ జ్యూస్ కలిపి చేసే మిశ్రమం) కాక్‌టైల్ ఇష్టమని, వారు రెగ్యులర్‌గా దానినే తీసుకుంటారని చెబుతుంటారు. మరి ఈ కాక్‌టైల్‌ను ఏ ఏ మద్యాలు కలిపి చేశారో తెలియాల్సిఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close