మోడీని తీసుకొస్తారు సరే.. మరి డబ్బులు కట్టించగలరా..!?

నిరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం … సమర్థమైన వాదనలు వినిపించిన భారత ఏజెన్సీలు విజయం సాధించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. పధ్నాలుగు వేల కోట్ల మేర మోసం చేసి.. నిరవ్ మోడీ లండన్ పారిపోయారు. కొన్నాళ్లు ఆయన ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. ఆయన వద్ద పలు రకాల పాస్‌పోర్టులు ఉండటంతో అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా మాత్రం గుర్తించారు. చివరికి లండన్ వీధుల్లో తిరుగుతున్న నిరవ్ మోడీని మీడియానే గుర్తించి పలకరించింది. అప్పట్నుంచి ఆయనను ఇండియాకు తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిరవ్ మోడీ.. ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయన పేరుతోనే సొంత బ్రాండ్ ఉంది. తనకు ఎంతో బ్రాండ్ వాల్యూ ఉందని నమ్మించి… పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించలేదు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది.

బ్రిటన్ కోర్టులో భారత్ సమర్థవంతమైన వాదన వినిపించింది. దీంతో యూకే కోర్టు కూడా.. నీరవ్‌ మోడీని శిక్షించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సబబేనని.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మోడీ ప్రయత్నించారని తేల్చింది. భారత్‌కు అప్పగించడం వలన ఆయనకు అన్యాయం జరగదని స్పష్టంచేసింది. అప్పగించాలని ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో లాంఛనాలు పూర్తి చేసి.. ఆయనను ఇండియాకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయనను ఇండియాకు తీసుకు వస్తారు సరే.. మరి డబ్బులు ఎలా వసూలు చేస్తారన్నది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఆర్థిక నేరాల చట్టాల ప్రకారం.. ఆయన కొంత కాలం జైల్లో ఉంటారు. తర్వాత బెయిల్ వస్తుంది.

ఆ తర్వాత ఆయన నిర్భయంగా ఇండియాలో పర్యటిస్తారు. భారీ బ్యాంక్ మోసం చేసిన వ్యక్తిగా ఆయనకు గౌరవమే లభిస్తుంది కానీ.. చీత్కారాలు లభించవు. ఇండియాలో పరిస్థితి అలా మారిపోయింది. పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడి లండన్ కు వెళ్లి దాక్కున్న వారిలో విజయ్ మాల్యా, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ కూడా ఉన్నారు. లలిత్ మోడీని ఇండియాకు అప్పగించే పిటిషన్లు తేలిపోయాయి. విజయ్ మాల్యాపై పిటిషన్లు మాత్రం విచారణలో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close