ఏపీ అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిపోయిందంటున్న వాసిరెడ్డి పద్మ..!

ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలపై ప్రేమోన్మాదుల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఒక ఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందనే దానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. వినూత్నమైన కారణం చెప్పారు.. అదేమిటంటే.. అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిపోవడమట,. అబ్బాయిల్లో క్రూరత్వం ఎలా పెరిగిపోయిందో.. నర్సరావుపేట డిగ్రీ విద్యార్థిని అనూష హత్య ఘటన చూస్తే తెలిసిపోతోందని ఆమె బాధపడ్డారు. విష్ణువర్థన్ రెడ్డి అనే యువకుడు.. అనూషను చంపేశాడు. నిన్నంతా అనూష బంధువులు ఏడు గంటల పాటు పల్నాడు రోడ్డును దిగ్భంధించి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు.

రాత్రికి సీఎం జగన్ రూ. పది లక్షల నష్టపరిహారం ప్రకటించడంతో ఈ రోజు అందరూ బయటకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ.. అనూష స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఏపీలో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఆడపిల్లలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారనే మౌలికమైన ప్రశ్నకు సమాధానాన్ని పక్కన పెట్టి… అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిందని కారణం చెప్పుకొచ్చారు. ఆడపిల్ల అంటే చులకనభావం ఏర్పడిందని.. కాలేజ్ లకు .. ఆఫీసులకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో పడేలా ఉందని చెప్పుకొచ్చారు. 21 రోజుల్లో ఉరిశిక్ష పడితే చూడాలని అందరూ కోరుకుంటున్నారని.. ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెళ్లడం… బాధితుల్ని పరామర్శించి రావడం తప్ప… వాసిరెడ్డి పద్మ ప్రత్యేకంగా చేస్తున్న పనులేం లేవన్న విమర్శలు ఉన్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ అంటే వేధింపులకు గురవుతున్న వారికి రక్షణ కల్పించాలి. కానీ పరామర్శల కోసమే ఆ పదవిని వినియోగిస్తున్నారు. అమ్మాయిలు, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో నేరం చేసేవారిలో ధైర్యం పెరుగుతోంది. ఫలితంగా నేరాలు పెరిగిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ పాచిక..! ఎవరీ ఆకుల వెంకటేష్..?

తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ... ఏకంగా అచ్చెన్నాయుడుపైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్నదానిపై ఇప్పుడు టీడీపీలో...

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

HOT NEWS

[X] Close
[X] Close