స్కీల్ స్కాం : ఎఫ్ఐఆర్‌కు రెండేళ్లు – కనీసం చార్జిషీట్ లేదు !

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండేళ్ల కిందటే కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షితో పాటు కూలి మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేసి… నేరాలు ఆపాదించారో అందరూ చూశారు. కానీ సీఐడీ కోర్టులో అవినీతి జరిగిందని కనీస ఆధారాలు కూడా కూడా చూపించలేకపోయారు. ఇప్పటి వరకూ చార్జిషీటు దాఖలు చేయలేకపోయారు.

2021లో స్కిల్ కేసు నమోదు

స్కిల్ డెలవప్‌మెంట్ శాఖలో భారీ స్కాం జరిగిందని 2021లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టారని అప్పట్లో సీఐడీ కేసు నమోదు చేసింది. మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు. గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఇక్కడ స్కిల్ సెంట్రలు పెట్టారు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ పెట్టారు. లక్షల మంది ట్రైనింగ్ తీసుకున్నారు. ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అదే చెప్పింది. ప్రచారం కూడా చేసుకున్నారు.

90 శాతం నిధులివ్వలేదని సీఐడీ ఆరోపణ

90 శాతం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు భరించి పది శాతం ప్రభుత్వం భరించేలా స్కిల్ డెలవప్ మెంట్ ఒప్పందం జరిగింది. అందులో దాదాపుగా మూడు వేల కోట్లు సీమెన్స్ పెట్టాలి. కానీ అవేమీ పెట్టకుండానే ప్రభుత్వం పదిశాతం ఇచ్చింది. అవి దారి మళ్లాయనేది సీఐడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ ఒప్పందంలో ప్రాజెక్టు వాల్యూ రూ. 3700 కోట్లు ఇందులో 90 సీమెన్స్ పెడుతుందంటే దానర్థం. డబ్బులు తెచ్చి పెట్టడం కాదు.. సాఫ్ట్ వేర్..ఇతర స్కిల్ అని ఒప్పందపత్రాల్లోనే ఉందని టీడీపీ విడుదల చేశారు. ఒప్పందంలో ఉన్నట్లు స్కిల్ డెలవప్ మెంట్ సెంటర్లు అన్ని చోట్లా పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఒప్పందంలో ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టారని.. ట్రైనింగ్ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం కూడా సర్టిఫై చేసిందని చెబుతున్నారు. ఇప్పటికీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇక స్కాం ఎక్కడ ఉందని టీడీపీ ప్రశ్నిస్తోంది.

జగన్ రెడ్డి దగ్గరే నిర్ణయాలు తీసుకున్న అధికారులు

టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంట్రల ఏర్పాటుకు ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయి. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్‌లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయి. అయితే ఆ వివరాలు ఎక్కడా చెప్పడం లేదు. ఆర్జా శ్రీకాంత్ అనే ఐఏఎస్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏ స్కాం జరగలేదని తేల్చి చెప్పారు. ఆయనను విచారణ పేరుతో వేధించారు.

ఈ కేసులో డిజైన్ టెక్ తో పాటు ఇతర సంస్థలు… జీఎస్టీ ఎగ్గొట్టాయని ఈడీ కేసు నమోదు చేశారు. వాటిపై కేసులు నడుస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close