కేసు పెట్టినప్పుడు చెప్పిన కథే చెప్పిన సీఐడీ చీఫ్ – కొత్త ఆధారాలేవి ?

చంద్రబాబుకు అన్నీ తెలుసన్న ఆరోపణలు ఉన్నాయి.. ఐదు వందల కోట్ల రూపాయల స్కాం .. ప్రభుత్వానికి రూ. 370కోట్ల నష్టం.. నిధుల్ని షెల్ కంపెనీలకు మళ్లించారు.. అంతిమ లబ్దిదారు చంద్రబాబే.. అంటూ సీఐడీ చీఫ్ సంజయ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన వివరాలను ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే అసలు చంద్రబాబు ఎలా లబ్దిదారు అనే విషయం మాత్రం చెప్పదు. ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారంటే.. అన్నీ చంద్రబాబుకు తెలుసు కాబట్టి విచారణ చేయాల్సి ఉందని… కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఉందని ఓ సారి.. సాక్షులను ప్రభావితం చేస్తారని మరోసారి చెప్పుకొచ్చారు.

మార్గదర్శి పై చందాదారులను బెదిరిచి కేసులు పెట్టించినప్పుడు .. డిఫాల్టర్లను తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టిన ిఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడారు సంజయ్. రెండేళ్ల కిందట కేసు పెట్టినప్పుడు ఏ ఆరోపణలు చేశారో వాటినే మళ్లీ చేశారు. రెండేళ్ల విచారణలో చంద్రబాబుపై కొత్తగ ఏమైనా ఆధారాలు చూపించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబే ప్రధాన నిందితుడు.. చంద్రబాబుపై ఆరోరోపణలు ఉన్నాయి.. లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతామని.. బెదిరించినట్లుగా మాట్లాడారు. అసలు ఈ కేసులో జరిగిన తప్పేంటి.. అందులో చంద్రబాబు చేసిన నేరం ఏమిటి అన్నది మాత్రం సంజయ్ క్లారిటీగా చెప్పలేకపోయారు.

కీలక పత్రాలు మిస్సయ్యాయని సీఐడీ సంజయ్ చెబుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఉంది. పత్రాలు మిస్సయితే.. దానికి బాధ్యులెవరో కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఈ పత్రాలు మిస్సవడానికి కూడా చంద్రబాబే కారణం అని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు. అసలు గతంలో నోట్ ఫైల్స్ ఉన్నాయని.. అందులో అంతా సక్రమంగా ఉందని ఆర్జా శ్రీకాంత్ అనే ఐఏఎస్ అదికారిని ప్రశ్నించి..సెక్రటేరియట్ కు తీసుకెళ్లి తనిఖీలు చేయించినప్పుడు బయటకు వెల్లడయింది. అయినా ఇప్పుడు పత్రాలు పోయాయని చంద్రబాబే కారణం అంటున్నారు.

ప్రభుత్వానికి నష్టం జరిగిందా.. స్కాం జరిగిందా.. డబ్బులు చంద్రబాబు అకౌంట్లోకి వచ్చాయా అన్నది సీఐడీ చీఫ్ చెప్పలేదు. అంతిమంగా ఆయన ప్రెస్ మీట్ లో రెండేళ్ల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేసి నీలి, కూలి మీడియాలో ప్రచారం చేస్తున్న వాటినే చెప్పారు. చంద్రబాబు ఎలాబాధ్యడో ఆరోపణలు చేశారు. ఆధారాలు మాత్రం చూపించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close