రేపు టాలీవుడ్ కీల‌క స‌మావేశం

సోమ‌వారం టాలీవుడ్ లో కీల‌క‌మైన స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశంలో.. టాలీవుడ్ లోని అన్ని రంగాల ప్ర‌తినిథులూ పాల్గొంటారు. చిరంజీవి అధ్య‌క్ష‌తన ఈ మీటింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్‌. ఇటీవ‌ల చిరు సీఎం జ‌గ‌న్‌ని క‌లిశారు. ఆ మీటింగ్‌కి సంబంధించిన విష‌యాలూ, ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తారు. ఈ వేస‌విలో రాబోతున్న సినిమాల గురించి కొంత గంద‌ర‌గోళం ఉంది. ఒక్కో సినిమాకీ రెండు మూడు రిలీజ్ డేట్లు బ్లాక్ చేశారు. నాని – `అంటే.. సుంద‌రానికి` కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించారు. వీటిపై కూడా ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని కూడా తెలుగు చిత్ర‌సీమ త‌ర‌పున క‌ల‌వాల‌ని అనుకుంటున్నారు. ఆ సంగ‌తీ తేలే అవ‌కాశం ఉంది.

* కోలుకున్న చిరు

ఇటీవ‌ల క‌రోనా బారీన ప‌డిన చిరంజీవి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తాజా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు నెగిటీవ్ వ‌చ్చింది. ఇప్పుడు షూటింగుల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం `గాడ్ ఫాద‌ర్‌` సెట్లో ఉన్నారాయ‌న‌. త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` షూటింగ్ కూడా మొద‌ల‌వ్వ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close