ల‌తా మంగేష్క‌ర్ క‌న్నుమూత‌

గాయ‌ని, భార‌త ర‌త్న‌… ల‌తా మంగేష్క‌ర్ క‌న్నుమూశారు. కొద్దిసేప‌టి క్రితం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆమె ఆరోగ్యం స‌రిగా లేదు. ఇటీవ‌ల క‌రోనా బారీన ప‌డి, కోలుకున్నారు ల‌త‌. అయితే ఊపిరితిత్తుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌డంతో.. ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తూ వ‌చ్చారు. శ‌నివారం ఆమె ప‌రిస్థితి బాగా విష‌మించింది. డాక్ట‌ర్లు ఎంత ప్ర‌య‌త్నించినా ఆమె ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు.

1945లో చిత్రసీమ‌లో గాయ‌నిగా అడుగుపెట్టిన ల‌త‌.. దాదాపు 20 భాష‌ల్లో 50 వేల పైచిలుకు పాట‌ల్ని పాడారు ల‌త‌. ఆమె ఖాతాలో కొన్ని తెలుగు పాట‌లూ ఉన్నాయి. అక్కినేని `సంతానం` చిత్రంలో నిదురపో.. త‌మ్ముడా.. పాట సూప‌ర్ హిట్‌. ఆఖ‌రి పోరాటంలో.. `తెల్ల‌చీర‌కు..` పాట కూడా శ్రోత‌ల్ని అల‌రించింది. మ‌రాఠీలో `ఆనంద్ ఘ‌న‌` అనే పేరుతో కొన్ని చిత్రాల‌కు సంగీతం అందించారు. రెండు చిత్రాల్నీ నిర్మించారు. 2001లో భార‌త ప్ర‌భుత్వం ల‌తాకు భార‌త‌ర‌త్న ఇచ్చి స‌త్క‌రించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close