జమున మూడేళ్ళు బాయ్ కాట్.. అసలేం జరిగింది?

అలనాటి అగ్ర నటి జమున వెళ్ళిపోయారు. ఇప్పుడామె ఓ అందమైన జ్ఞాపకం. ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళితే.. అనేక సంగతులు, ముచ్చట్లు, విషయాలు గుర్తుకొస్తాయి. అయితే జమున కెరీర్ లో బాగా గుర్తుండిపోయే ఒక సంఘటన వుంది. జమునని అప్పటి అగ్ర కథానాయకులు ఇద్దరు బాయ్ కాట్ చేశారు. ఈ బాయ్ కాట్ కి కారణం.. జమున షూటింగ్ కి ఆలస్యంగా వస్తుందని, తమ ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది.

జమున లేకుండానే సినిమాలు చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ బాయ్ కాట్ నడిచింది. అయితే జమున కూడా దాని గురించి పెద్ద అలోచించకుండా మిగతా హీరోలతో సినిమాలు చేస్తూ వీలైనప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వేరే షూటింగులకు వెళ్ళినపుడు ఆ హీరోలతో మాట్లాడేవారు కానీ బాయ్ కాట్ గురించి అడిగేవారు కాదు. అయితే ‘గుండమ్మ కథ’ సినిమా ఈ బాయ్ కాట్ ని కాంప్రమైజ్ చేసింది. జమున కోసం మూడేళ్ళు కోసం ఎదురుచూసిన నాగి రెడ్డి చక్రపాణి చివరికి ముగ్గురు మధ్య రాజీ కుదిర్చారు.

ఈ బాయ్ కాట్ గురించి ఒకసారి జమున తన మనసులో మాట చెప్పారు. ‘’ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నిజానికి నాకు ఇబ్బంది వచ్చింది నాగేశ్వరరావుతోనే. తర్వాత ఆయన మరొకరిని కూడా కలుపుకున్నారు. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ‘నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండి’ అని నాగేశ్వరరావుతో చెప్పారు. అలా గుండమ్మ కథ చేశాం. అది చరిత్ర సృష్టించింది. తర్వాత ఎప్పుడు మా మధ్య పొర పొచ్చాలు రాలేదు’’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు జమున.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close