పవన్‌పై అతి స్పందనతో వైసీపీ ఏం కోరుకుంటోంది ?

పవన్ కల్యాణ్ ను దూషించకుండా వైసీపీ నేతల రోజు గడవడం లేదు. పండగ అని లేదు… ఆదివారం అనలేదు.. వారు నోటికి పని చెప్పాల్సిందే. రాజకీయంగా ప్రత్యర్థి అయినంత మాత్రాన అంత దారుణంగా విమర్శిస్తారా అన్న అభిప్రాయం సామాన్యుల్లో వస్తోంది. ఇంతకూ పవన్ ఏం చేశారంటే.. టీడీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇతర పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ.. పొత్తు పెట్టుకుంటున్నారని ఇలా వ్యక్తిగత హననానికి పాల్పడటం మాత్రం రాజకీయాల్లో కొత్త ధోరణే. రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్ విమర్శించారని మళ్లీ అదే పని చేశారు. పవన్ విధానాల పరంగా ప్రశ్నిస్తే.. వారు కూడా ఆ పద్దతిలోనే స్పందించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు.

వైసీపీ నేతల దారుణ వ్యాఖ్యల కారణంగా పవన్ కల్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అదే తరహాలో విమర్శిస్తున్నారు. ఈ కారణంగా పవన్ కు ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైఎస్ఆర్‌సీపీకి తెలియదా అంటే…తెలియదని.. అంచనా వేయలేదని అనుకోలేం. వైసీపీ నేతలు ఆయనను ఓ కులానికి పరిమితం చేయడానికో.. లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయడానికో ఈ విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ అధికారానికి ఇబ్బంది ఎదురవుతుందని ఫ్రస్ట్రేషన్ కు గురి కావడమేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.పవన్ ఒంటరిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలి వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని వారి ప్లాన్ కావొచ్చు.

పవన్ కు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి విమర్శలు చేయడం వెనకు వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ ను బలవంతుడిగా చూపించడం వల్ల తనకు క్రేజ్ పెరిగిందని పార్టీకి ఆదరణ పెరిగిందని జనసేన అనుకుంటే టీడీపీని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయవచ్చు. అప్పుడు రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయి. చివరికి పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సాఫీగా సాగదని ప్లాన్ కావొచ్చని అంటున్నారు. మొత్తంగా వైసీపీ రాజకీయం మాత్రం.. ఎవరూ ఊహించని విధంగా ఉంటోందని అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close