‘స‌ర్కారు వారి…’ నుంచి స‌ర్‌ప్రైజ్‌!

మ‌హేష్‌బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ క‌థానాయిక‌. ప్ర‌స్తుతం… దుబాయ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈనెల 21న ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది. ఆ రోజే చిత్ర‌బృందం దుబాయ్ నుంచి హైద‌రాబాద్ తిరిగి వచ్చేస్తుంది. స్వ‌ల్ప విరామం త‌ర‌వాత‌… కొత్త షెడ్యూల్‌కి శ్రీ‌కారం చుడతారు. అయితే… స‌ర్కారు వారి నుంచి ఓ చిన్న స‌ర్‌ప్రైజ్ రాబోతోంద‌ట‌. 21న దుబాయ్ షెడ్యూల్ కి పేక‌ప్ చేప్పిన సంద‌ర్భంలో.. ఆరోజు ఓ చిన్న వీడియోని రూపొందించ‌బోతున్నార్ట‌. టీజ‌ర్ అని చెప్ప‌కూడ‌దు కానీ, దుబాయ్ షెడ్యూల్ ని ముగించ‌బోతున్న‌ట్టు చెబుతూ… కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ తో ఈ వీడియోని డిజైన్ చేయిస్తున్నార‌ని స‌మాచారం. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడ‌న్న‌ది కూడా అప్పుడే చెబుతార్ట‌. 2022 సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close