రేవంత్ పాదయాత్ర పార్టీ కోసమా..? సొంతానికా..?

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నా… తమ రాజకీయాలు మాత్రంమానడం లేదు. పార్టీలో అంతర్గతంగా ఎన్నైనా చేసుకోవచ్చు కానీ.. బహిరంగంగా మాత్రం.. పార్టీకి మేలు కల్పించే పనులు చేయాల్సి ఉంది. ఏ పార్టీలో అయినాఇదే చేస్తారు.కానీ.. కాంగ్రెస్లో మాత్రం భిన్నం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమై పోయినా పర్వాలేదు.. చివరికి తమ రాజకీయ భవిష్యత్ కూడా ఇబ్బందుల్లో పడినా పర్వాలేదు.. తమకు నచ్చని నేత మాత్రం… ఎలాంటి ముందడుగు వేయకూడదన్నట్లుగా ఆ పార్టీ నేతల తీరు ఉంటుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయంలో అదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు భరోసాయాత్ర చేశారు. సోమవారంతో ముగుస్తుంది. హైదరాబాద్ శివారులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పట్టించుకోవడం లేదు.

కాంగ్రెస్‌కు ఎంతో కొంత లాభం చేకూర్చే ఇలాంటి పోరాటాలను ప్రోత్సహించాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… తన అనుమతి తీసుకోలేదంటూ అలిగారు. దాంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు. తన వర్గంగా చెప్పుకునే నేతలెవర్నీ అటు వైపు పోనియలేదు. చివరికి..ముగింపు సభకు కూడా ఉత్తమ్ వెళ్లడం లేదు. ఉత్తమ్ వెళ్లకపోవడం మాత్రమే కాదు.. సీనియర్ నేతలెవరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్.. మాణిగం ఠాగూర్‌పైనా.. హాజరు కావొద్దని ఒత్తిడి తెస్తున్నారు. ఆయన హాజరైతే.. పాదయాత్రకుహైకమాండ్ మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతుందని… అంతిమంగా అది రేవంత్ రెడ్డికి మరింత అడ్వాంటేజ్ అవుతుందని నమ్ముతున్నారు.

రేవంత్ రెడ్డికి పార్టీలో ఓ బలమైన వర్గం తయారైంది. అయితే ఆవర్గంలో నేతలు తక్కువ. ద్వితీయ శ్రేణి నేతల్లో డెభ్బై శాతం మంది వరకూ రేవంత్ రెడ్డి అయితేనే పార్టీని ఓ గాడిన పెడతారని గట్టిగా నమ్ముతున్నారు. కానీ పార్టీలో ఎదిగిపోవాలనుకుంటున్న కొంత మంది నేతలు… ఇతరుల్ని కిందకుతోసేసి.. తామున్న స్థానమే పెద్దదని చెప్పుకోవాలని తాపత్రయ పడుతూండటంతో సమస్య వస్తోంది. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయినా… కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అంతం ఉండదని.. సెటైర్లు వేస్తున్నారు. బీజేపీకి… కాంగ్రెస్ పార్టీ నేతల తీరే ప్లస్ పాయింట్‌గా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close