కేసీఆర్ పుట్టినరోజు…పులకించిపోతున్న టాలీవుడ్ స్టార్స్..!

తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు ఏదైనా చిన్న పిలుపునిస్తే.. టాలీవుడ్ స్టార్స్ మొత్తం పులకించిపోతున్నారు. తామంటే తాము ముందన్నట్లుగా ప్రకటనలు వీడియోలు విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఎంపీ సంతోష్ లాంటి పుట్టిన రోజులకే.. మెగాస్టార్ సైతం స్పందిస్తూ ఉంటే.. ఇక.. కేసీఆర్ పుట్టినరోజు కోసం స్పందించకపోవడం వింతే అవుతుంది. పైగా.. ఈ సారి కేసీఆర్ పుట్టిన రోజును భిన్నంగా భారీఎత్తున నిర్వహించబోతున్నారు. ఆయన పుట్టినరోజుకు గుర్తుగా కోటి మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. దీనికి గురించి టాలీవుడ్ పెద్దలకు తెలిసిందో.. లేదో ఇలా పిలుపునియ్యాలని అధికార పార్టీ పెద్దల నుంచి సందేశం వచ్చిందో కానీ.. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వీడియోలు విడుదల చేస్తున్నారు.

చిరంజీవి, నాగార్జున ఈ లిస్టులో ముందుగా చేరారు. వీరిద్దరే.. ఇటీవలి కాలంలో కేసీఆర్ సర్కార్‌తో ఎక్కువ ర్యాపో మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. దీంతో వారు కేసీఆర్పుట్టిన రోజున కోటి మొక్కల నాటడాన్ని ప్రమోట్ చేయడం తమ బాధ్యతగా భావించినట్లుగా ఉన్నారు. అందుకే.. వీడియోలు రిలీజ్ చేశారు. సినీ నటి రోజా… వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ… వీడియో విడుదల చేశారు. ఇక టాలీవుడ్‌లోని ఓ స్థాయి… ప్రముఖులంతా… వీడియోలతో ఈ రోజు హంగామాచేసే అవకాశం ఉంది. అలా వీడియోలు విడుదల చేసే వారికి .. తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనడంతో సందేహంలేదు. అలాంటి అడ్వాంటేజ్‌ను ఎవరు కాదనుకోగలరు.

అయితే… కోటి మొక్కలు నాటడం అనేది సాధ్యమేనా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఒక్క తెలంగాణలో సాధ్యం కాదు కాబట్టి… యాభై దేశాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని అంటున్నారు. చిరంజీవి, నాగార్జున పిలుపు మేరకు ఎంత మంది మొక్కలు నాటుతారో కానీ.. ఈ సెలబ్రిటీల పిలుపుతో.. కేసీఆర్ పుట్టిన రోజును మాత్రం.. ఘనంగా చేయాలన్న సంకేతాలు మాత్రం అభిమానులకు వెళ్లాయి. వారేం చేస్తారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close