టైటిల్ కి న్యాయం చేస్తున్న సినిమా

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా `ఆడాళ్లూ మీకు జోహార్లు`. ఈ సినిమా టైటిల్ కి న్యాయం చేస్తు్న్నాడు…ద‌ర్శ‌కుడు. మ‌హిళల ఔన‌త్యాన్ని, వాళ్ల మాన‌సిక దృక్ప‌థాన్ని చూపించ‌బోతున్నాడు ఈ సినిమాలో. దానికి త‌గ్గ‌ట్టుగానే మ‌హిళా పాత్ర‌ల‌తో ఈ సినిమాని నింపేస్తున్నాడు. ఇందులో ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు వెట‌ర‌న్ క‌థానాయిక‌ల‌కు చోటిచ్చాడు. ఈ సినిమా కోసం ఖుష్బూ, రాధిక‌, ఊర్వ‌శిల‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో ఈ ముగ్గురు న‌టీమ‌ణులు క‌నిపిస్తార‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. `అజ్ఞాత‌వాసి`లో ఖుష్బూ ఓ కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఆ త‌ర‌వాత త‌ను తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. రాధిక న‌టించి కూడా చాలా కాల‌మైంది. ఈ ముగ్గుర్నీ ఒకే స్క్రీన్ పై చూడ‌డం ఆ త‌రం ప్రేక్ష‌కుల‌కు ఓ చ‌క్క‌టి అనుభూతిగా మిగులుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close