చిరుకి క‌థ చెప్పిన మారుతి

చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వ‌రుస‌గా సినిమాల‌పై సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ లో ఆయ‌న యువ ద‌ర్శ‌కుల‌కే అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఇప్ప‌టికే మోహ‌న్ రాజా, బాబి, మెహ‌ర్ ర‌మేష్ క‌థ‌ల‌కు ఓకే చెప్పారు. ఇప్పుడు మారుతి క‌థ‌కీ ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. చిరంజీవితో సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఆయ‌న రెండు మూడు క‌థ‌ల్ని కూడా రెడీ చేసుకున్నారు. ఇటీవ‌ల చిరుని క‌లిసి.. ఓ క‌థ వినిపించిన‌ట్టు స‌మాచారం. దానికి చిరు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశార్ట‌. మ‌రోవైపు అల్లు అర‌వింద్ కూడా ఈ క‌థ విన్నార‌ని, ఆయ‌న‌కు న‌చ్చిన త‌ర‌వాతే.. చిరంజీవి ద‌గ్గ‌ర‌కు పంపార‌ని తెలుస్తోంది. అల్లూ ప్రోత్సాహం కూడా తోడ‌వ్వ‌డంతో ఈ ప్రాజెక్ట్ కి క్లియ‌రెన్స్ వ‌చ్చేసిన‌ట్టే. చిరు సెకండ్ ఇన్సింగ్స్‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. అప్పుడెప్పుడో.. బోయ‌పాటి శ్రీ‌ను – చిరంజీవి కాంబోలో ఓ సినిమా చేయాల‌ని అల్లు అర‌వింద్ భావించారు. `విన‌య విధేయ రామా` ఫ్లాప్ అవ్వ‌డంతో.. చిరు ఆ రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం గీతా ఆర్ట్స్‌.. మారుతి కాంబోలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

HOT NEWS

[X] Close
[X] Close