ప్రాజెక్ట్ Kలో స‌మంత‌?

ప్ర‌భాస్ చేస్తున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ కె`. కె అనేది ఈ సినిమా టైటిల్ లో మొద‌టి అక్ష‌రం. ఆ టైటిల్ ని రివీల్ చేయ‌కుండా.. కేవ‌లం మొద‌టి అక్ష‌రాన్నే.. వ‌ర్కింగ్ టైటిల్ గా పెట్టుకుంది చిత్ర‌బృందం. ఈ సినిమాలో ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె లాంటి స్టార్లు ఉన్నారు. ఇప్పుడు మ‌రో క‌థానాయిక కూడా న‌టించ‌బోతోంద‌ని టాక్‌. ఈ సినిమాలో క‌థానాయిక త‌ర‌వాత అంతటి ప్రాధాన్యం ఉన్న స్త్రీ పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌లో స‌మంత‌ని ఎంచుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అయితే ఇది డీ – గ్లామ‌ర్ పాత్ర‌. ఇది వ‌ర‌కు ఇలాంటి డీ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో స‌మంత మెప్పించింది. `మ‌హాన‌టి`తో నాగ అశ్విన్ తో సమంత‌కు మంచి అనుబంధం ఏర్ప‌డింది. అందుకే … `ప్రాజెక్ట్ కె`లోనూ స‌మంత‌ని తీసుకోవాల‌ని నాగ అశ్విన్ భావిస్తున్నాడు. ప్ర‌భాస్ సినిమా.. పైగా నాగ అశ్విన్‌. అమితాబ్ లాంటి మ‌హాన‌టుడు ఉన్నాడు. కాబ‌ట్టి.. స‌మంత నో చెప్పే ఛాన్సే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ : మాస్ట్రో

మంచి క‌థ‌ని ఎంత చెత్త‌గా తీసినా చూడొచ్చు చెత్త క‌థ‌ని ఎంత బాగా చెప్పాల‌నుకున్నా చూడ‌లేం - అన్న‌ది సినిమా వాళ్లు న‌మ్మే మాట. అందుకే మంచి క‌థ‌లు ఎక్క‌డైనా స‌రే చ‌లామ‌ణీ అయిపోతుంటాయి....

ల‌వ్ స్టోరీ కోసం చిరంజీవి

నాగార్జున‌తో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` స‌మ‌యంలో చిరు ప్ర‌త్యేక‌మైన అభిమానంతో ఆ సినిమాని ప్ర‌మోట్ చేశాడు. నాగ‌చైత‌న్య‌,...

ఏపీలో ఇళ్ల రుణాల వన్‌టైం సెటిల్మెంట్ పథకం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం...

చిన్నారి హత్యాచార నిందితుడి “ఆత్మహత్య” శిక్ష!

రాజకీయ వివాదంగా మారిన సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు చివరికి "ఆత్మహత్య" శిక్షకు గురయ్యాడు. రాజు అనే ఆ నిందితుడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. ఘట్...

HOT NEWS

[X] Close
[X] Close