పాట పాడుకోవడానికి బ్యాంకాక్‌ చెక్కేస్తున్న ఆది.!

‘ప్రేమకావాలి’ చిత్రంతో హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆదికి ఇప్పటివరకు సరైన సూపర్‌హిట్‌ సినిమా రాలేదు. అతని కెరీర్‌లో ‘లవ్‌లీ’ ఒక్కటే కాస్త ఫర్వాలేదు అనిపించే సినిమా. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టినవే. మదన్‌ దర్శకత్వంలో ఆది చేసిన ‘గరం’ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో ఆ బాధ్యతను తీసుకొని సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి సాయికుమార్‌ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కాకుండా వీరభద్రమ్‌ డైరెక్షన్‌లో ‘చుట్టాబ్బాయి’ పేరుతో చేస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా వున్నాడు ఆది. ఈ చిత్రానికి సంబంధించి ఆల్‌రెడీ ఫస్ట్‌హాఫ్‌ కంప్లీట్‌ అయిపోయింది. జనవరి 29 నుంచి బ్యాంకాక్‌లో 5 రోజులపాటు హీరో ఆది ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో చిత్రీకరించబోతున్నారు. పాటతోపాటు కొన్ని సీన్స్‌ కూడా అక్కడ షూట్‌ చేస్తారట. బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తర్వాత ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది. దాని తర్వాత మార్చి 2 నుంచి రాజమండ్రిలో జరిగే 20 రోజుల షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుందట.

తనకి సరైన హిట్‌ రావాలని ఆది ఎదురుచూస్తున్నట్టుగానే డైరెక్టర్‌ వీరభద్రమ్‌ కూడా హిట్‌ కోసమే చూస్తున్నాడు. తమ ఇద్దరికీ ‘చుట్టాలబ్బాయి’ పెద్ద హిట్‌ సినిమా అవుతుందని వీరభద్రమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close